ఇండియన్ ఆర్మీ ఎంత మందిని లేపేసిందో చూడండి…!

-

పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్న దాయాది పాకిస్తాన్ కి కరోనా వేళ భారత ఆర్మీ చుక్కలు చూపించింది. సరిహద్దుల్లో భారీ ఎత్తున కాల్పులకు దిగింది మన ఆర్మీ. పాక్ సైనికులను, ఉగ్రవాద శిభిరాలను, పేలుడు పదార్ధాల నిల్వల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది మన ఆర్మీ. ఈ కాల్పుల్లో పాక్ వైపు భారీగా నష్టం జరిగింది. దీనిపై అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది.

తాజాగా ఈ కాల్పుల్లో ఎంత మంది మరణించారు అనే దానిపై లెక్క బయటపెట్టారు. ఈ నెల 10వ తేదీన జరిగిన కాల్పుల్లో 15 మంది పాక్ సైనికులను, 8 మంది ఉగ్రవాదులను అంతం చేసామని, దాడికి సంబంధించిన వీడియో ని కూడా బయటపెట్టారు. పాకిస్తాన్ పై మన సైన్యం… ఆర్టిలరీ గన్స్‌తో దాడికి దిగిందని, ఈ దాడిలో పాక్‌ భారీ నష్టాన్ని చవి చూసిందని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది.

టెర్రర్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌తో పాటుగా పాక్ ఆర్మీ లాంచింగ్‌ ప్యాడ్స్‌ కూడా ధ్వంసమైనట్లు వీడియోలో పేర్కొంది. భారీ స్థాయిలో ఆ నష్టం ఉందని నిఘా వర్గాలు కూడా పేర్కొన్నాయి. కిషన్ గంగా నది ఒడ్డున పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్‌నైల్‌పై దాడులు చేయాలనుకుందని హెచ్చరించగా వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ… వాళ్ళు దాడి చేయకముందే దాడులకు దిగింది.

Read more RELATED
Recommended to you

Latest news