బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా మళ్ళీ నాగార్జున …ఈ సారి బిగ్ హౌజ్ ఎక్కడో తెలుసా ..?

-

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా అదరగొడుతున్నాడు. బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లకి ఏ మాత్రం తగ్గకుండా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ని సక్సస్ ఫుల్ గా నడించారు నాగార్జున. తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ బిగ్ రియాలిటీ షో త్వరలో నాలుగో సీజన్ కి సన్నద్దమవుతుంది. ఇప్పటికే తెలుగులో మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని, మూడవ సీజన్ కి మన్మధుడు నాగార్జున హొస్ట్ లు గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

 

అయితే తాజాగా సీజన్ 4 కి సిద్దమవుతున్న ఈ బిగ్ రియాలిటి షోకి ఈసారి హొస్ట్ గా వ్యవహరించబోయో స్టార్ హీరో ఎవరూ అన్న ఆసక్తి ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సీజన్ 4 హోస్ట్ గా చాలామంది స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయి. వాళ్ళలో ముఖ్యంగా చిరంజీవి అని.. వెంకటేష్ అని, సూపర్ స్టార్ మహేష్ బాబు, నంబర్ వన్ యారీ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రానా దగ్గుబాటి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే చిరంజీవి పేరు తెరమీదకి రావడానికి కారణం మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటి షోకి ఆయన హొస్ట్ గా వ్యవహరించారు కాబట్టి. అయితే చిరంజీవి సీజన్ 4 కి హోస్ట్ కాదని తేలిపోయింది.

 

అయితే సీజన్ 1, 2, 3 కి హోస్టులుగా వ్యవహరించిన ఎన్.టి.ఆర్, నాని, నాగార్జున ల లో ఎవరు సీజన్ 4 కి హొస్ట్ అన్న దాంట్లో స్టార్ మా బృంద క్లారిటికీ వచ్చారని తెలుస్తుంది. సీజన్ 3 ని సక్సస్ ఫుల్ గా నడిపిన కింగ్ నాగార్జున నే సీజన్ 4 కి హోస్ట్ గా ఫిక్సైయ్యారని సమాచారం. అంతేకాదు నాగార్జున హొస్ట్ గా మొదలవబోయో బిగ్ బాస్ సీజన్ 4 జూలై లో మొదవబోతుందట. కరోనా ఎఫెక్ట్ గాని సమసి పోతే జూలై లేదంటే ఆగస్టు నుండి స్టార్ “మా” లో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈసారి కూడా బిగ్ హౌస్ హైదరాబాద్ లోనే ఉండనుంది. సీజన్ 3 జరిగిన బిగ్ హౌస్ లో సీజన్ 4 కూడా నిర్వహించబోతున్నారట. దీనికి సంధించిన కంటెస్టెంట్స్ … అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news