ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా భయమే ప్రజలను వెంటాడుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనాతి కాలంలో ప్రపంచదేశాలను కమ్మేసి.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా దెబ్బకు మృత్యువు ఒడిలోకి వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్డౌన్ విధించడమే కాకుండా.. కఠన చర్యలు కూడా చేపట్టాయి. కంటికి కరోనా కనిపించకపోయినా.. దాన్ని మట్టుపెట్టే మందు చేతిలో లేకపోయినా.. ప్రపంచదేశాలు వెనుకడుగు మాత్రం వేయడం లేదు.
అలాగే ప్రపంచదేశాలను వణికిస్తున కరోనా తెలంగాణను సైతం బెంబేలెత్తిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటగా.. మరణాల సంఖ్య 16కు చేరుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లాక్డౌన్ పొడిగించాలని కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. మరియు శనివారం ఉదయం రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలోనూ కేసీఆర్ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు బటయకు వస్తున్నాయి.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేల్ అయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ కారణంగా తెలంగాణలో ఓ మంచి జరిగింది. లాక్ డౌన్ టైమ్లో అక్కడ క్రైం రేటు గణనీయంగా తగ్గిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. అది కూడా స్నాచింగ్ రేటు సున్నాకు పడిపోవడం విశేషం. మార్చి 1 నుంచి మార్చి 21 వరకు 10 స్నాచింగ్ కేసులు నమోదు కాగా.. మార్చి 22 నుంచి ఏప్రిల్ 9 వరకు ఒక్క స్నాచింగ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా.. కిడ్నాప్ కేసులు, వాహనాల దోపిడీలు, రేప్ కేసులు.. ఇలా పలు నేరాలు గణనీయంగా తగ్గాయంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసింది. మరి వాటిపై ఓ లుక్కేసేయండి.