ఐఫోన్ ఎస్ఈ 2020 ని విడుద‌ల చేసిన ఆపిల్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

-

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ త‌న ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌కు గాను 2020 ఎడిష‌న్‌ను తాజాగా విడుద‌ల చేసింది. అయితే ఈ ఫోన్‌ను ఇప్ప‌టికే ఆపిల్ లాంచ్ చేయాల్సి ఉంది. కానీ క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల లాంచ్ చేయ‌లేక‌పోయింది. ఇక ఎలాంటి ఈవెంట్‌ను నిర్వహించ‌కుండానే ఆపిల్ ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌డం విశేషం. అయితే ఈ ఫోన్‌ను ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2 అని లేదా ఐఫోన్ 9 పేరిట లాంచ్ చేస్తుంద‌ని భావించారు. కానీ వాటికి బ‌దులుగా ఐఫోన్ ఎస్ఈ 2020 పేరిట ఈ ఫోన్‌ను ఆపిల్ లాంచ్ చేసింది. మ‌రి ఈ ఫోన్‌లో అందిస్తున్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

డిజైన్, డిస్‌ప్లే…

ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్‌ను ఎరోస్పేస్‌-గ్రేడ్ అల్యూమినియంతో త‌యారు చేశారు. ఈ ఫోన్ ముందు భాగంలో ఉన్న గ్లాస్ అత్యంత నాణ్య‌త‌ను, మ‌న్నిక‌ను క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్‌, రెడ్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో ల‌భిస్తోంది. ఇందులో ఐపీ 67 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లే సైజ్ 4.7 ఇంచులు కాగా.. దీనికి ట్రూటోన్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే డాల్బీ విజ‌న్‌, హెచ్‌డీఆర్ 10 ప్లేబ్యాక్ వంటి ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇక ఫోన్ ముందు భాగంలో ట‌చ్ ఐడీ క‌లిగిన హోం బ‌ట‌న్‌ను అమ‌ర్చారు.

ఎ13 బ‌యానిక్ చిప్‌…

ఆపిల్ త‌న ఐఫోన్ 11, 11 ప్రొ ఫోన్ల‌లో ఏర్పాటు చేసిన ఎ13 బ‌యానిక్ ప్రాసెస‌ర్‌ను ఐఫోన్ ఎస్ఈ 2020లోనూ అందిస్తోంది. దీంతో ఫొటోగ్ర‌ఫీ, గేమింగ్‌, అగ్‌మెంటెడ్ రియాలిటీని మ‌రింత బాగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఫోన్ చాలా వేగవంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఎ13 చిప్‌సెట్‌ను అమ‌ర్చ‌డం వ‌ల్ల వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. అలాగే 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవ‌లం 30 నిమిషాల్లోనే పూర్త‌వుతుంది. ఇక వైఫై 6 ఫీచ‌ర్‌ను అందించ‌డం వ‌ల్ల వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతోపాటు డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ ఐఫోన్‌లో అందిస్తున్నారు. ఒక సిమ్ ట్రేలో ఫిజిక‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. మ‌రొక‌టి ఇ-సిమ్ త‌ర‌హాలో ప‌నిచేస్తుంది.

apple launched iphone se 2020 look what are the features in it

కెమెరా ఎక్స్‌పీరియెన్స్‌…

ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరాను అమ‌ర్చారు. అయితే ఈ ఫోన్‌లో ఎ13 బ‌యానిక్ ప్రాసెస‌ర్ ఉన్నందున స‌ద‌రు కెమెరాతో నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు చిత్రీక‌రించుకోవ‌చ్చు. అందుకు గాను పోర్ట్రెయిట్ మోడ్‌, పోర్ట్రెయిట్ లైటింగ్ ఎఫెక్ట్స్‌, డెప్త్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక 60ఎఫ్‌పీఎస్ చొప్పున 4కె వీడియోల‌ను ఈ ఫోన్‌తో చిత్రీక‌రించుకోవ‌చ్చు. అలాగే ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌తో స్లో-మో వీడియోల‌ను షూట్ చేసుకోవ‌చ్చు. ముందు భాగంలో 7 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్ కు ఈ కెమెరా సపోర్ట్‌ను ఇస్తుంది.

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్లు…

* 4.7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1334 x 750 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* సిక్స్ కోర్ ఎ13 బ‌యానిక్ 64 బిట్ ప్రాసెస‌ర్‌, 8 కోర్ న్యూర‌ల్ ఇంజిన్
* 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఐఓఎస్ 13, డ్యుయ‌ల్ సిమ్
* ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ ఎల్‌టీఈ
* 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 7 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ట‌చ్ ఐడీ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 802.11 ఏఎక్స్ వైఫై 6
* బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, లిథియం అయాన్ బ్యాట‌రీ
* క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

ధ‌ర‌లు…

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, ప్రొడ‌క్ట్ (రెడ్‌) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్ ధ‌ర భార‌త్‌లో రూ.42,500 గా ఉంది. అలాగే 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌లు రూ.47,800, రూ.58,300గా ఉన్నాయి. అమెరికాలో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 24వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. అలాగే భార‌త్‌లో ఆపిల్ ఆథ‌రైజ్డ్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను త్వ‌ర‌లో విక్ర‌యించ‌నున్నారు. కానీ ఈ ఫోన్‌ను భార‌త్‌లో ఎప్ప‌టి నుంచి విక్ర‌యించేది.. ఆపిల్ వెల్ల‌డించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news