చైనా కంటే ముందే భారత్‌ లో ‘కరోనా’.. నిజ్జంగా నిజం

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ మనిషీ భయపడుతున్న ఒకే ఒక్క పేరు… కరోనా (కోవిడ్ – 19)! ఈ రేంజ్ లో ప్రపంచ నాబాను వణికించిన అంశం ఈ మధ్యకాలంలో లేదనే చెప్పాలి. అయితే… కరోనా అనే పేరు ప్రపంచానికి పరిచయం అయ్యింది ఈ మధ్య కాలంలో… అది కూడా చైనా పుణ్యమా అని కానీ… ఇంతక ముందే ఈ పేరుతో ప్రపంచంలో… అంతెందుకు, మన దేశంలోనే ఊరిపేర్లు, హోటల్ల పేర్లు ఉన్నాయి! కాకపోతే… ఈ పేరు ఒక మహమ్మారికి పెడతారని తెలియదు అంతే! రోడ్డుపై అటుగా వెళ్తున్న వ్యక్తిని ఆపి… నువ్వు ఎక్కడినినుంచి వస్తున్నవ్ లేక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే…

కరోనా నుంచి వస్తున్నా లేక కరోనాకి వెళ్తున్నా అంటే… ఆ పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటాది? అనంతరం ఆ వ్యక్తి ప్రతిస్పందన మరెలా ఉంటాది? ప్రస్తుతం ఈ సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతున్న ప్రదేశం… ఉత్తర ప్రదేశ్ లోని సీతారాం జిల్లలో కనిపిస్తుంది. ఇంతకూ కారణం ఏమిటి అంటారా…. ఆ గ్రామం పేరు “కొరోనా”! అది కాస్తా అందరికి కరోనాలా అనిపించడం!
ఇది మనదేశంలోని ఊరుపేరు అయితే… కేరళలోని ఒక దుకాణం పేరు, గుజరాత్ లోని ఒక హోటల్ పేరు కూడా కరోనా నే! ఇక ప్రపంచంలోని ఈ కరోనా పేరు విషయానికొస్తే… నెదర్లాండ్స్ లో ఈ కరోనా పేరుతో… హోటల్ కరోనా అనీ ఒక రెస్టారెంట్ కూడా ఉంది! ఆస్ట్రియాలో ఒక గ్రామానికి.. న్యూ మెక్సికోలో మరో గ్రామానికి.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ప్రాంతానికి.. కెనడాలో ఒక రైల్వే స్టేషన్ కు… ఇలా చాలా వాటికి కరోనా అనే నామకరణం ఎప్పటినుంచో ఉంది! కాకపోతే… అది కోవిడ్ – 19 వైరస్ వల్ల వచ్చే జబ్బు పేరు అని ప్రస్తుతం హల్ చల్ చేస్తుండటంతో…

వారు తమ ఊరుపేరు, హోటల్ పేరు, షాపు పేరు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే… మరి కొందరు మాత్రం… ఇదోరకమైన ఫ్రీ పబ్లిసిటీలే బాసూ అని పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారట! అక్కడితో అయిపోయిందనుకునేరు… ఈజిప్టులోని ఎప్పుడో 1919లొ ప్రారంభించబడిన ఒక చాక్లెట్, బిస్కెట్ ల కంపెనీ పేరు కూడా కరోనా నే!! అంతెందుకు… గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడి చుట్టూ ఏర్పడే వలయాకార కాంతిని కూడా కరోనా అని పిలుస్తారట. అంతేనా… మనిషి పన్ను, పుర్రె లపైభాగాల్ని కూడా కరోనా అని పిలుస్తారట! అమ్మ కరోనా… నీ పేరు మామూలుఫేమస్ కాదు! కాకపోతే… ఇప్పుడే ప్రపంచానికి బాగా తెలుస్తుందన్నమాట!

Read more RELATED
Recommended to you

Latest news