అవసరమైతే వాళ్ళకోసం చేయిచాచి అడుగుతా అంటున్న మెగాస్టార్ చిరంజీవి ..!

-

ప్రస్తుతం కరోనా కారణంగా దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. అంధకారంగా మారింది. దిన సరి కూలీల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు అన్ని మూతపడ్డాయి. గత రెండు నెలలనుంచి మరో 15 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది అనుకుంటున్నప్పటికి అది ఇంకా కొనసాగూతూనే ఉంది. అంతేకాదు రోజు రోజుకి పరిస్థితి కష్టతరంగా మారుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ రోజు కొత్త కేసులు నమోదవుతున్న కారణంగా నిన్న రాత్రి తెలంగాణా ముఖ్య మంత్రి కె.సి.ఆర్ లాక్ డౌన్ ని మే 7 వరకు పొడగించారు.

 

ఈ నేపథ్యంలో చిన్న కుటుంబాలు, రోజువారి కూలీలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే అందుకు ప్రత్యామ్నయాలు చేస్తూ చాలా వరకు విజయం అవుతున్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతలు తీసుకొని తమ చుట్టు పక్కల వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇక చిత్ర పరిశ్రమలోని వారందరు తమ వంతు గా సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి, అలాగే ముఖ్య మంత్రి రిలీఫ్ ఫండ్ కి ఆర్ధిక సహాయం ప్రకటించి విరాళాలు అందించారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో సిసిసి ని ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో దాదాపు 12 వేల కుంటుంబాలకి నెలవారి నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇందుకు చిరంజీవి, ఎన్ శంకర్ సారధ్యంలో ఈ కార్యక్రమం సాగుతుంది. ఇందుకు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ హీరోలందరి నుంచి మొదలు కొని నాగార్జున ఫ్యామిలి, వెంకటేష్ ఫ్యామిలి, నాని, మహేష్ బాబు, తారక్, లావణ్య త్రిపాఠి, కాజల్ అగర్వాల్, తమన్నా, కార్తికేయ…ఇలా చాలమంది ఇందులో భాగమయ్యారు. వీరందరు కలిసి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలోని పేద కుటుంబాలకి నేరుగా అందిస్తున్నారు. ఇక ఇదే సందర్భంలో చిరంజీవి క్లారిటి ఇస్తూ అవసరమైతే మరో రెండు నెలలపాటు ఈ నిత్యావసర వస్తువులు అందిస్తామని తెలిపారు. అంతేకాదు నాకున్న పరిచయాలతో పెద్ద పెద్ద వాళ్ళైన జి.వి.కె, జి.ఎం.ఆర్ లాంటి వాళ్ళదగ్గర్నుంచి నా సన్నిహితులదగ్గర .. పేదకోసం మొదటిసారి చేయిచాచి అడుగుతానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news