ఇది రికార్డుల ‘సర్కార్’

-

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న సాయంత్రం రిలీజైంది. టీజర్ అలా రిలీజైందో లేదో యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టింది. కేవలం పదంటే పది నిమిషాల్లో సర్కార్ టీజర్ 10 లక్షల వ్యూస్ అంటే 1 మిలియన్ మార్క్ అందుకుంది.

అంతేకాదు గంటలో 4 మిలియన్ వ్యూస్ అందుకున్న సర్కార్ టీజర్ 24 గంటలు గడవకముందే 11 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది. సౌత్ లో విజయ్ కు ఉన్న క్రేజ్ ఏంటి అన్నది సర్కార్ టీజర్ తో ప్రూవ్ అవుతుంది. 24 గంటల్లో ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి. ఇక పాత రికార్డుల్లోకి వెళ్తే రజిని 2.ఓ 24 గంటల్లీఓ 3.25 కోట్ల వ్యూస్ సాధించింది. ఇక సైరా టీజర్ కూడా 24 గంటల్లో కోటి వ్యూస్ సాధించింది. విజయ్ మర్సల్ సినిమా కూడా ఒక్కరోజులో కోటి వ్యూస్ సాధించింది.

ఇక లైకుల విషయంలో కూడా సర్కార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రస్తుతం 1 మిలియన్ లైకులతో ఏ ఇండియన్ సినిమా సృష్టించని అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది సర్కార్ మూవీ టీజర్. టీజర్ లోనే ఇంత హంగామా చేస్తే ఇక సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో అని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news