ఇంగ్లిష్ మీడియంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

-

గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ఇంగ్లిష్ మీడియ బోధనపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం అయిన సంగతి తెలిసందే! ఈ విషయాలపై… మాతృబాషను జగన్ నిర్వీర్యం చేయబోతున్నారు అని, తగిన సాస్తే జరిగిందని ప్రతిపక్షాలు హడావిడి చేస్తే… ఇది విజయమో, పరాజయమో కాదు, దీనిపై సుప్రీం కు వెళ్తాం అన్న్ విధంగా ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సర్కారు నిర్ణయం – కోర్టు తీర్పుల సంగతి అలా ఉంచి.. అసలు తల్లి తండ్రులు ఏమనుకుంటున్నరు అనే విషయం తెలుసుకోవడం ముఖ్యమని భావిస్తోంది ఏపీ సర్కార్!

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ఇందిలో భాగంగా… జీవో రద్దుతో ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుండి 5వ తరగతులు చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా… అభిప్రాయాల సేకరించనుంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ను ఆదేశించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అభిప్రాయ సేకరణ తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దీంతో హైకోర్టు తీర్పు అనంతరం స్పందించిన ఏపీ మంత్రి… ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలనే ఏపీ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో.. నిజంగా ఏపీ సర్కార్ ఈ విషయంలో వెనక్కితగ్గే ఆలోచన చేయడం లేదని అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో… వీరి ఆలోచన మేరకు తల్లితండ్రులు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు అనే విషయం చాలా కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news