పిల్లల తల్లితండ్రులే జగన్ ని కాపాడబోతున్నారా ? ఇది సరికొత్త స్కెచ్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాలు అభివృద్ధి చెందాలని ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని పేదలకు అందించడానికి జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని కార్పొరేట్ శక్తులు మరియు ప్రతిపక్షాలు అంతా కలిసి అడ్డు పడ్డాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేయించి ఇంగ్లీష్ మీడియం పేద వాళ్లకి అందకుండా చేశాయి.AP CM YS Jagan asks officials to set up corona virus testing labs ...పరిస్థితి ఇలా ఉండగా వైయస్ జగన్ ఖచ్చితంగా పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం చదవాలని ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరోపక్క హైకోర్టు ఏ మీడియం పిల్లలు చదవాలో డిసైడ్ చేసేది తల్లిదండ్రులు అన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తన మార్క్ కొత్త స్కెచ్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా ఏ మీడియంలో బోధించాలి అనే దానిపై సర్వే చేయడానికి రెడీ అయ్యారు.

 

దీనికోసం ఇంటింటి సర్వే చేయించి నివేదిక వచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ లాగా వెయ్యాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఖచ్చితంగా ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యావిధానాన్ని సపోర్ట్ చేయటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి సుప్రీంకోర్టులో ఉచితంగా పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం జగన్ సర్కార్ ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం గ్యారెంటీ అని న్యాయ నిపుణులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news