చంద్రముఖి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నయనతార. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన నయనతార అతి తక్కువకాలంలోనే తెలుగు, తమిళం లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. ఒకానొక స్టేజ్ లో టాలీవుడ్, కోలీవుడ్ లో వరసగా నయనతార నటించిన సినిమాలే రావడం గమనర్హం. అక్కడ రజనీకాంత్, నుండి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి వరకు తమ కి ఛాయిస్ గా నయనతార ని సెలెక్ట్ చేసుకునేవారు.
అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సౌత్ లేడీ సూపర్‌స్టార్ అన్న పాపులారిటీని సంపాదించుకుంది. ఇన్ని బ్లాక్ బస్టర్స్, ఇంతమంది స్టార్స్ హీరోల సరసన నటించిన నయనతారకి కాంట్రవర్సీలు ఎక్కువే. వ్యక్తిగత విషయాల నుంచి ప్రొఫొషనల్ విషయాల వరకు కాంట్రవర్సీలు బాగా ఎక్కువే. రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా మేకర్స్ ఒప్పుకునేవారు. ప్రమోషన్స్ కి రానని చెప్పినా భరించేవాళ్ళు. అందుకు కారణం తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళని భారీగా సాధిస్తుండటమే.
అయితే ఈ మధ్య నయనతార ని కాస్త పక్కనపెడుతున్నారు. అందుకు రెండు కారణాలు అని చెప్పుకుంటున్నారు. వాటిలో కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం తో పాటు సినిమాని ప్రమోట్ చేయకపోవడం, రెండవది తన సినిమాలు అంతగా సక్సస్ సాధించకపోవడం. దాంతో మేకర్స్ కంటే ముందే నయనతార కాంప్రమైజ్ అయి జాగ్రత్త పడుతుందట. ఉన్న క్రేజ్ గనక పోతే ఇక లైఫ్ క్లోజ్ అన్న ఆలోచన వచ్చిందనే ఇలా నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ మీడియా సమాచారం. నయనతార ఇప్పటి నుంచి తను నటించే సినిమా ప్రమోషన్స్ కి వస్తానని అంటుందట. ఇక రెమ్యూనరేషన్ కూడా డిమాడ్ చేయడం లేదట. మొత్తానికి నయనతార ఇన్నాళ్ళకి కొన్ని మెట్లు దిగింది అని చెప్పుకుంటున్నారు.