ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర౦లొ అధికారంలో ఉన్న అధికార వైసీపీ ఇప్పుడు టీడీపీ నేతల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లి జగన్ ని కలవడం ఆ తర్వాత కొందరు యువనేతలు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోవడం వంటివి జరిగాయి.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు విజయవాడ ఎంపీ గా ఉన్న కేసినేని నానీ కూడా పార్టీ మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన టీడీపీకి రాజీనామా చేసి బిజెపిలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. ఇక ఆయన కాంట్రాక్ట్ లు కూడా ఈయన చేస్తారని అంటారు.
ఈ తరుణంలోనే ఆయన పార్టీలోకి రావాలని కేసినేని ని ఆహ్వానించారని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉంది కాబట్టి, ఆర్ధికంగా బలమైన నేత కాబట్టి బిజెపిలోకి వస్తే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర బిజెపిపై మీకు పూర్తి స్వేచ్చ ఇస్తామని, తమ జోక్యం ఉండదు అని కూడా చెప్పారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది.
గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరిపై కేసినేని అసహనంగా ఉన్నారు. తన కుమార్తె కు విజయవాడ మేయర్ సీటు అడిగినా సరే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కావాలా ఇప్పుడు విజయవాడ మేయర్ సీటు కావాలా అనే విధంగా కండీషన్ పెట్టడం కేసినేనికి ఇబ్బందిగా మారిందని అందుకే ఆయన పార్టీ మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది.