2006 లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ గుర్తుండే ఉంటుంది కదా చాలా మందికి… ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 435 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 438 పరుగులు చేసి ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఆ మ్యాచ్ లో జట్టు కెప్టెన్ గ్రేం స్మిత్… ఓపెనర్ హర్షేల్లె గిబ్స్ 175 పరుగులు చేసి ఒకరకంగా విధ్వంశం సృష్టించాడు. దీనితో భారీగా పరుగులు చేసినా ఆసిస్ విజయాన్ని సాధించలేదు.
గిబ్స్ కేవలం 111 బంతుల్లో 175 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. ఇక ఇప్పుడు కరోనా కోసం ఆ రోజు వాడిన బ్యాట్ ని అమ్మాలి అని నిర్ణయం తీసుకున్నాడు గిబ్స్. ఈ మేరకు ట్వీట్ చేసాడు. 438 పరుగుల ఛేదనలో నేను ఉపయోగించిన బ్యాట్‌ను వేలానికి ఉంచుతున్నా అని చెప్పాడు. ఇన్నాళ్ల నుంచి ఆ బ్యాట్‌ను నా వద్దే భద్రంగా ఉంచుకున్నా అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
2016లో ఐపీఎల్లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెంచరీలు చేసి జట్టును గెలిపించిన బెంగళూరు బ్యాట్స్మెన్లు ఏబీ డివిలియర్స్, కోహ్లి ఆ మ్యాచ్ లో తాము వాడిన కిట్స్ ని ఏప్రిల్ 27 న వేలానికి ఉంచి సేకరించిన డబ్బుని భారత్ దక్షిణాఫ్రికా దేశాల్లో కరోనా పోరాటానికి అందించారు. మరి కొంత మంది సఫారి ఆటగాళ్ళు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వనున్నారు.