ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం. రాబడి ఎక్కువగా వ్యవసాయం నుండి రావడం తో ముఖ్యమంత్రి జగన్ రైతులకు మొదటి నుండి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ మే నెల రావటంతో మరోపక్క వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో ఏపీ రైతులు మంచి సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఏప్రిల్ నెలలోనే వర్షాలు కురవడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా అయితే ఏప్రిల్, మే నెలల్లో రాయలసీమలో మండుటెండలు కాస్తాయి.కానీ అనూహ్యంగా ఇటీవల రెండు మూడు సార్లు భారీ వర్షాలు అనంతపురం జిల్లాలో మరికొన్ని చోట్ల కూరవడటంతో ఖరీఫ్ పంట పట్ల ఆశాజనక వాతావరణం ఏర్పడుతుంది. దాదాపు ఇప్పటికే ఖరీఫ్ పంటకు సంబంధించి వ్యవసాయ పనులు చాలా వరకు స్టార్ట్ అయిపోయాయి. ఇటువంటి తరుణంలో ఇప్పటివరకు కరోనా వైరస్ పై ఫోకస్ పెట్టిన జగన్… జూన్ మొదటి వారంలోగా రైతులకు వేరుశనగ విత్తనాలు అందించేదాన్ని విషయంపై అలర్ట్ అయితే రైతులకు మేలు చేసినట్లు అవుతుందని చాలామంది అంటున్నారు.
వేరుశెనగ పంపిణీ తదితర అంశాల విషయంలో జగన్ ముందు నుండి అధికారులను ‘ అలర్ట్ ‘ చేస్తే మే నెలలోనే విత్తన వేరుశెనగ పంపిణీ జరిగితే… వేరుశనగ రైతులు కూడా పనులు ప్రారంభిస్తే సరైన టైంకి పంట అందుతుందని చాలా మంది మేధావులు అంటున్నారు. ఒకపక్క కరోనా విపత్తును ఎదుర్కొంటూనే మరోపక్క వేరుశెనగ వ్యవసాయ పనులు కూడా ప్రభుత్వం స్టార్ట్ చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.