మడోన్నాకు కరోనా…! ఆరోగ్యం విషమం…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ కి పేద ధనిక అనే తేడా లేదు. దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అందరికి కూడా కరోనా వైరస్ సోకుతుంది. చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులకు కరోన వైరస్ సోకుతుంది. బ్రిటన్ ప్రధాని, ఇజ్రాయెల్ ప్రధాని సహా పలువురికి కరోనా వైరస్ సోకింది. మన దేశంలో కూడా కొందరు రాజకీయ నాయకులకు సినీ ప్రముఖులకు కరోనా సోకింది.

ఇక తాజాగా హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు కూడా కరోనా సోకింది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందనే ప్రచారం కూడా కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. దీని మీద స్పష్టత లేదు గాని చాలా వార్తలే వస్తున్నాయి ఇప్పుడు. తాజాగా దీనిపై ఆమె క్వారంటైన్ డైరీలో స్పందించింది. క్వారంటైన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోలుకున్నాను. ఇటీవల చేయించిన పరీక్షలలో నా శరీరంలో యాంటీ బాడీస్ ఉన్నట్టు గుర్తించాను.

కరోనాని ఎదిరించే యాంటీబాడీస్ అధికంగా ఉండడంతో తొందరగా కోలురకున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది… ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. అయితే కొన్ని పత్రికలు మాత్రం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని అంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news