ఈ పంట వేస్తే వ్యవసాయం దండగ కాదు పండగ అంటారు..!

-

వ్యవసాయం అంటే కత్తిమీద సాములాంటిదే.. వస్తే లాభాలు..పోతే ప్రాణాలు అన్నట్లు ఉంటుంది. నేడు ఎంతోమంది రైతులు పెట్టుబడి డబ్బులు కూడా రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క అదే వ్యవసాయం చేసి కోట్లు సంపాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. సంప్రదాయ పద్ధతిలో కూడా అధునాతన పద్ధితిలో వాణిజ్య పంటలు సాగుచేస్తే.. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవచ్చు.. అలాంటి ఓ పంట గురించి ఈరోజు చూద్దామా..!
వెల్లుల్లి సాగుతో అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే 6 నెలల సమయంలోనే.. ఏకంగా రూ.10 లక్షల వరకు వస్తుంది… వెల్లుల్లి.. వాణిజ్య పంట. భారతదేశంలో దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సుగంధ ద్రవ్యంగానే కాకుండా..ఔషధంగానూ వెల్లుల్లిని ఉపయోగిస్తారు.
సాధారణంగా రైతులు వానాకాలం ప్రారంభంలో విత్తనాలు వేస్తారు. కానీ వెల్లుల్లి సాగుకు వర్షాకాలం అనుకూలమైనది కాదు. వానాకాలం ముగిసిన తర్వాత వెల్లుల్లి సాగును ప్రారంభించాలి. అక్టోబర్, నవంబర్ నెలలు ఈ పంటకు అనుకూలం.. వెల్లుల్లిని దాని మొగ్గల నుంచి పండిస్తారు. వెల్లుల్లిలో చాలా రకాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారులను సంప్రదించి.. మంచి మేలు రకం సాగు చేస్తే లాభం ఉంటుంది.. రియా వాన్ రకం వెల్లుల్లికి మార్కెట్‌లో మంచి రేటు ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. ఇతర వెల్లుల్లి రకాల కంటే రియావన్ నాణ్యత బాగుంటుంది. ఒక్కో వెల్లుల్లి గడ్డ 100 గ్రాముల వరకు ఉంటుందట… ఒక్క గడ్డలో 6 నుంచి 13 మొగ్గలు ఉంటాయి.
పంట వేసిన తర్వాత.. నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. వెల్లుల్లి ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.. క్వింటాల్‌కు 10000 నుంచి 21000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40000 వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మీరు ఒక ఎకరం భూమిలో రియా అటవీ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా సులభంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ప్రాసెస్ చేసి.. వెల్లుల్లి పేస్ట్, పొడి రూపంలో విక్రయిస్తే.. ఇంకా లాభాలు పొందవచ్చు.. రెండు చేతుల్లా సంపాదించడం అంటే ఇదే కదా..! మీకు ఆసక్తి ఉంటే.. మీ దగ్గర వ్యవసాయ అధికారులను సంప్రదించి మీ భూమిలో వెల్లుల్లి సాగు చేయొచ్చో లేదో తెలుసుకుని మొదలుపెట్టొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news