పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పట్టు పురుగులు పెంపకం కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.. ముఖ్యంగా వాటిని పెంచుతున్న గదిని శుభ్రంగా ఉంచాలి.చదరపు అడుగు గది వైశాల్యానికి 154 మిల్లీ లీటర్ల ద్రావణం చొప్పున పట్టుపురుగుల పెంపక గదికి మరియు పరిసరాలు శుద్దీకరణకు అవసరమౌతుంది. చదరపు అడుగు గది వైశాల్యానికి 190 మిల్లీ లీటర్ల చొప్పున పట్టుపురుగులు మేపు గదికి పరికరాలు శుద్ధీకరణకు అవసరమౌతుంది. అందులో 35 శాతం పరికరాలకు, పనిముట్లకు మరియు 65 శాతం గది శుద్ధిచేయుటకు నిర్దేశించబడిoది.

ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య కాలము అనువైoది. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల మంచి ఫలితం వస్తుంది. ప్రతి పంటకు రెండు సార్లు శుద్ధి కార్యక్రమం చేపట్టాలి. పంట గూళ్ళు అమ్మకం జరిగిన వెంటనే మొదటిసారి తిరిగి పంట ప్రారంభించడానికి 3-5 రోజులు ముందుగా రెండవసారి శుద్ధీకరణచేపట్టాలి..

రెండు దశలలో శుద్ధి ప్రక్రియను చేపట్టాలి అవేంటో ఇప్పుడు చుద్దాము..

పంట పూర్తి అయిన తర్వాత మిగిలిన రోగకారకమైన, చెత్త చెదారం, పాడైన గూళ్ళ అవశేషాలన్నింటిని సేకరించి కాల్చివేయాలి. రేరింగ్ గదిని పరికరాలను శుద్ధిచేయడానికి 2 శాతం బ్లీచింగ్ పౌడర్ను 0.3 శాతం కాల్చిన సున్నంతో కలిపి వాడాలి. దీనికోసం 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను 19 లీ నీటిలో బాగా కరిగించాలి. వేరొక పాత్రలో అరలీటరు నీటిలో 60 గ్రాముల కాల్చినసున్నoను కరిగించాలి. ఈ రెండు ద్రావణాలు కలిపి మిశ్రమమును పిచికారీ చేయడానికి ఉపయోగించాలి. బ్లీచింగ్ ద్రావణము బదులు క్లోరిన్డ డయాక్సైడ్ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం తయారు చేయు పద్ధతి ముందు పాఠ్యాంశంలో తెలియజేయడమైoది.

5 రోజుల ముందు పైన సూచించిన విధంగా శుద్ధి ప్రక్రియను మరొక్క సారి చేపట్టాలి. పనిముట్లను ఎండలో ఆరబెట్టాలి.పంట పూర్తి అయ్యాక పెంపకపు గదిని మామూలు నీటితో కడుగకూడదు. దీనివల్ల సూక్ష్మజీవులు గదిలోపలి గోడ రంధ్రాల చీలికల్లో చేరుకొని వృద్ధి చెందుతాయి. కాబట్టి శుద్ధద్రావణంతో గదిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నీటితో కడుగుట చేయాలి..వీటిని ఒక పద్ధతిగా చెయ్యాలి..తొట్టిలో సగం వరకే శుద్ధి ద్రావణాన్ని నింపాలి. తొట్టిని నింపటానికి 2 శాతం బ్లీచింగ్ పౌడరు + 0.3 శాతం కాల్చిన సున్నంతో కలిపిన ద్రావణాన్ని ఉపయోగించాలి.’ అన్ని పరికరాలను 10 నిముషాలపాటు ముంచి, తర్వాత ఆరబెట్టాలి. ద్రావణం కలుషితమైనచో దాన్ని తీసివేసి తాజాగా చేసిన ద్రావణంతో నింపాలి..

అదే విధంగా..ఐడో ఫోర్స్.. ఇవి క్రిములను తాకగానే నేసెంట్ అయోడిన్ విడుదలై వాటిని చంపి వేస్తుంది. వీటివలన పరికరాలకు త్రుప్పుపట్టదు. మరియు ఇవి విషరహితమ్..సోడియం హైపోక్లోరైట్.. ఇది బ్లీచింగ్ లక్షణంతో పాటు బలమైన ఆక్సిడైజింగ్ పదార్థంగా పనిచేస్తుంది. ఈ ద్రావణం పాలిపోయిన పసుపు పచ్చరంగులో ఉంటుంది. మత్తు కారకం కాదు. నీటిలో కరుగుతుంది. గాడ నిక్షిప్తరూపంలో క్లోరిన్ విడుదల కావడంవల్ల ఇది శుద్ధికారిగా పనిచేస్తుంది..వీటి గురించి మరింత సమాచారం కోసం నిపునుల సలహా తీసుకోవడం మంచిది..