లేయర్ కోళ్లకు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

గుడ్ల కోసం లేయర్ కోళ్లను పెంచాలనుకునేవారు ముందుగా అన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు..ముఖ్యంగా 72వారాల పాటు వాటికి ఎటువంటి వ్యాదులు, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సరైన టైం లో వీటికి టీకాలు కూడా తప్పక వేయించాలి.. లేయర్ కోళ్లకు రెండు దశలుగా టీకాలను అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.. అప్పుడే వ్యాధులు రావట.. టీకాలను ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

మొదటి దశ టీకాలు..

కోడి పిల్లలు షెడ్ కు వచ్చిన మొదటి రోజే మారెక్స్‌ వ్యాధి రాకుండా కోడి పిల్లల తలపైన ఉన్న చర్మానికి 0.2 మిల్లీ లీటర్ల మారెక్స్‌ వ్యాధి టీకాను వేయాలి. 5వ రోజు లసోటా, ఐబీ కలిసిన టీకాను మరోసారి వేయాలి.. ఈ కోళ్ల పెంపకంలో భాగంగా కోడి పిల్లలకు కొక్కెర తెగులు అదే విధంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా లసోటా, ఐబీ కలిసి ఉన్న వ్యాక్సిన్‌ను కోడి పిల్లల కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాల్సి ఉంటుంది. 8 నుంచి 10 రోజుల వయసులో లేయర్‌ కోళ్ల పిల్లలకు ముక్కులను కత్తిరించడమన్నది చేయాలి.

11వ రోజు గంబోరవ వ్యాధి రాకుండా ఇన్‌పెక్టివ్స్‌ బర్సల్‌ డిసీజ్‌ టీకాను కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాలి. 21వ రోజు మళ్లీ ఈ ఐబీడీ టీకాను మొదటి సారి చేసినట్టుగానే కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క వేయాలి. 22 నుంచి 25 రోజుల వయసులో కోడి పిల్లల కాళ్లకు ఉన్న గోర్లను కత్తిరించాలి.30వ రోజు మళ్లీ లసోటా, ఐబీ రెండో డోసు టీకాను వెయ్యి కోళ్లకు అయితే 1500 డోసుల మందును తాగే నీటిలో కలిపి ఇవ్వాలి. 7 వారం మొదటల్లో ఫౌల్ పాక్స్ టీకా ఇచ్చి ఏడవ వారం చివరిలో కొరైజా కిలిడీ టీకాను ఇవ్వాలి. 8వ వారంలో వీవీఎన్ డి తొలి డోసు టీకాను వేసుకోవాలి.. మొదటి దశలో మాత్రం ఈ టీకాలను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి..

రెండో దశ టీకాలు..

లేయర్ కోళ్లు 11 వారానికి చేరుకున్నప్పుడు రెండో దశ మొదలవుతుంది..11వ వారంలో లేయర్ కోళ్లకు ఎన్ డీ కిలుడు టీకాను రెండో డోసు ఇవ్వాలి. 12వ వారంలో కొరైనా కిలుడు టీకాను రెండో డోసు ఇవ్వాలి. 13వ వారంలో ఫౌల్ పాక్స్ టీకాను రెండో డోసు వేయాలి. 14వ వారంలో వీవీఎన్ డీ టీ కాను రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 16వ వారంలో ఎన్ డీ కిలుడు టీకాను మూడో డోసు వేయాలి.టీకాలు ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించటం మాత్రం మర్చి పోకూడదు. తెల్లవారు జామున లేదంటే సాయంత్ర సమయంలో టీకాలను వేసుకోవాలి. టీకాలు ఇచ్చే సమయంలో కోళ్లు బెదరకుండా చూడాలి. నీటిలో కలిపి ఇచ్చే సందర్భంలో నీరు చల్లగా ఉండేలా చూడాలి. నీటిని త్వరగా తాగటానికి నీటిలో టీకాతోపాటు, గ్లూకోజ్ కూడా కలిపి ఇవ్వాలి.. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. గుడ్లు పెట్టే దశకు రాకముందే టీకాలను ఇవ్వాలి..

Read more RELATED
Recommended to you

Latest news