చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు ఈ పాదయాత్ర సాగనుంది. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.
మొత్తం 125 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొంటారని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. లోకేష్ పాదయాత్రకు కొందరు కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనం తిరగబడితే ఏం జరుగుతుందో గతంలో చూసామని.. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుంటే మంచిదని చెప్పారు. యువగలం పేరుతో ప్రజల్లోకి వస్తున్న నారా లోకేష్ ని ఆశీర్వదించాలని కోరారు బాలకృష్ణ.