గొర్రెల పెంపకం చేపట్టేవాళ్ళు వీటిని తప్పక తెలుసుకోవాలి..

-

పాడి పశువులు మంచి లాభాలను అందిస్తాయి. వ్యవసాయం కన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా పాడి,పశువుల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో గొర్రెలు,కోళ్ల పెంపకాన్ని ఎక్కువగా చేస్తున్నారు.ముఖ్యంగా గొర్రెల పెంపకం పై జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనలు పాటించాలి.అప్పుడే ఇంకాస్త మంచి ఫలితాలను పొందొచ్చు అని అంటూన్నారు..వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అధారపడతాయి..

గొర్రెల పెంపకం చాలా సులువుగా అతి తక్కువ ఖర్చుతో పెంచుకునేందుకు వీలు ఉంటుంది. తక్కువ వర్షపాతం గల తెలంగాణా, రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో లాభదాయకంగా ఉంటుంది. గొర్రెలనుండి మనకు కావాల్సిన మాంసం,ఉన్ని, తోలు, వ్యర్థపు ఎరువులు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహించడం సంతోషకరం. వీటికి ప్రత్యేకమైన దాణా అంటూ ఇవ్వనవసరం లేకుండా పంట పొలాల్లో వృధాగా పెరిగే గడ్డి , పంట నుండి వచ్చే వాటిని తీసుకొని బలంగా తయారవుతాయి..

గొర్రెలు బాగా వృద్ధి చెందాలి అంటే ఆడ గొర్రెలు బాగుండాలి..అప్పుడే మంద కాస్త ఎక్కువగా తయారవుతుందట.ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి .మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్ళులేని గొర్రెలను ఏరివేయాలి. అడ గొర్రెలను సంతలో కాకుండా,రైతుల మందలోనే చూసి కొనాలి. సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి తీసివేయాలి. లేదా మొదట ఈనిన గొర్రెలను తీసుకోవడం మంచిది.

పొట్టేళ్లని మందపై వాడడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయసు గలదై ఉండాలి. కవల పిల్లల నుండి వచ్చిన పొట్టేలు అయితే మంచిది. మందలో ప్రతి 30 ఆడ గొర్రెలు ఉంటే, ఒక మగ గొర్రె ఉండేలా చూసుకోవాలి..పశు వైద్యుల సలహా తీసుకొని గొర్రెలను ఎంపిక చెసుకోవడం మరీ మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news