సజ్జలో అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

-

సజ్జ పంటను మెట్ట భూమిలో ఎక్కువగా పండిస్తారు.. గింజల కోసం మాత్రమే కాదు..పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు..సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో మరియు నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అత్యధిక పోషక విలువలను కలిగి ఉండి, అత్యధిక శక్తిని ఇవ్వగల ఆహార ధాన్యపు పంట.

మురుగు నీరు నిల్వ వుండే భూములు సజ్జ సాగుకి పనికిరావు. సజ్జ మొక్కకి భూమిలో ఉన్న క్షార గుణాలను కూడా తట్టుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల అన్ని భూముల్లో ఈ పంటను సాగు చేపట్టవచ్చు. పంట వేసే ముందుగా భూమిలో ఇతర పంటల అవశేషాలను తప్పనిసరిగా తొలంగించాలి..లేకుంటే మాత్రం సిలింద్రాలు వచ్చే అవకాశం వుంది.లోతు దుక్కులు దున్నాలి.

సజ్జ పంట సాగుకు ఖరీఫ్‌ అంటే వర్షాకాలపు పంటగా జూన్‌, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్‌, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి. సూటి రకాలైతే మంచి నాణ్యత గల విత్తనం ఎన్నుకోవాలి. హైబ్రీడ్‌ ,సూటి రకాలను నమ్మకమైన సంస్థల నుంచి ధృవీకరించిన విత్తనం వాడుకోవటం మంచిది. విత్తుటకు వారం రోజుల ముందు మొలక శాతం పరీక్షించి 90 శాతం పైన ఉన్న విత్తనాన్నే విత్తనంగా వాడుకోవాలి..మొలకను బట్టి విత్తనాలను నిర్ణయించుకోవాలి..

ఇకపోతే ఒక హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు 1.6 కిలోలు విత్తనం సరిపోతుంది. విత్తనం నాటే ముందుగా 2% ఉవ్పు ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు వుంచడం ద్వారా ఎర్గాట్‌ శిలీంద్ర అవశేసాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు..ఆ గింజలు ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్‌ను లేదా అప్రాన్‌ 35 ఎస్‌.డి. మందు తో విత్తన శుద్ధి చేసుకొవాలి..

Read more RELATED
Recommended to you

Latest news