కోళ్లకు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు..నివారణ చర్యలు..

-

మనుషులకు ఎలాగైతే రోగాలు వస్తాయో అదే విధంగా జంతువులకు కూడా వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే కోళ్లకు వైరస్ ల కారణంగా ఎక్కువగా వ్యాధులు వస్తాయి..కోళ్లు పెద్ద సంఖ్యలో వ్యాధులు, పరాన్నజీవులు బాధపడతాయి, వాటి ఉనికిని ముందుగానే గుర్తించటం అవసరం. తద్వారా కోళ్ల పెంపకంలో నష్టాలను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో కోళ్ళలో వ్యాధులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వివిధ రకాల వైరస్ ల ప్రభావంతో వ్యాధులకు లోనై పెద్ద సంఖ్యలో కోళ్ళు చనిపొతాయి..

కోళ్లకు వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కోళ్ళ మశూచి :

కోళ్ళ అంటువ్యాధుల్లో ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవుటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడుప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6 వారాల వయసులో మరలా 16వారాల వయసులో వేయాల్సి ఉంటుంది.

పుల్లోరం :

చిన్న కోడి పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. ఈ వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం లక్షణాలు ఉంటాయి. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్‌, కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్‌ మందులు వాడాలి.ఇవే రానికెట్ రోగం,రక్త పారుడు రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కోడి మెత్తగా వుంటే వాటిని వెంటనే వైద్యులు చూపించి మందులను వాడటం మంచిది..లేదంటే మిగిలిన కోళ్లకు కూడా వ్యాధులు వ్యాపించి చనిపోయే ప్రమాదం వుంది..

కొరైజ :

కోడి పిల్లలు సరిగా నీటిని, మేత తీసికొనక బరువును కోల్పోతాయి. ముక్కునుండి, కళ్ళనుండి నీరు కారుట రోగ లక్షణాలు. కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశించిన, అన్ని బ్యాచ్లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది. ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్‌, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్‌ మందులు విటమిన్ల తో కలిపి వారం రోజులకు ఒకసారి అందించాలి..

బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినకపోవడం జరుగుతుంది. మరణించిన కోడి పిల్లల ప్రేగులు ఉబ్బి కనిపిస్తాయి. యాంటిబయోటిక్స్‌ మందులు మేతలో మరియు నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు..నిత్యం కోడి పిల్లలు ఎలా ఉన్నాయో చూస్తూ,ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.. ఇంకేదైనా సమస్యలు వుంటే పశు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news