ద్రాక్ష సాగులో రైతులు ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి..

-

ద్రాక్ష ఒకప్పుడు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండించేవారు..కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఈ పంటను పండిస్తున్నారు..అయితే ఈ ద్రాక్ష లో కొన్ని మెలుకువలు పాటించాలి.అప్పుడే మరిన్ని లాభాలను పొందవచ్చు.. ఎటువంటివి ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ద్రాక్షలో కొమ్మలు కత్తిరించుట చాలా ముఖ్యం..దీని వల్ల ద్రాక్ష త్వరగా పండ్లను ఇచ్చును. తీగను సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా ద్రాక్ష పంటను ఇవ్వదు. మన రాష్ట్రంలో సంవత్సరంకు 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించుట వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడతాయి..

ద్రాక్ష గుత్తుల పరిమాణం , నాణ్యత పెంచుటకై జిబ్బరిల్లిక్ ఆసిడ్ అను హార్మోన్ ను పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 50-60 PPM GA, ద్రావణంలో ఉంచుట వలన 30-50% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది..

ద్రాక్ష పండ్లు తీగపైనే పక్వమునకు వచ్చిన పిదప కోస్తారు. పండ్లు కోసిన పిదప దాని పక్వ దశలో ఏమార్పు రాదు. సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్న గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది. పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్ల లో మొత్తం కరిగే ఘనపదార్థాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిస్తాం. బ్రిక్సిరీడింగ్ అనాబ్-ఇ-షాహి 15 to 16 డిగ్రీలు, మరియు థాంప్సన్ సీన్లెస్ 21-22 డిగ్రీలు/ రాగానే కోయవచ్చు..

దిగుబడి సాగు చేయవల్సిన రకం నేల మరియు ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో | అనబి-ఇ-షాహి 10-15 టన్నులు/ఎకరానికి, థామ్సన్ సీడ్స్ 6-8 టన్నులు/ ఎకరానికి దిగుబడి ఇస్తుంది.. ఇంకేదైనా సందెహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మేలు..

Read more RELATED
Recommended to you

Latest news