అన్నదాతల కోసం అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన అమ్మాయిలు  

రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి తండ్రి కష్టం బాగా తెలుస్తుంది. ఆ కష్టాన్ని కల్లారా చూసిన ఇద్దరు యువతులు వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఈ రోజుల్లో పొలాల్లో గడ్డి మందులు కొడుతూ.. ఆ ఘూట పీల్చి ఎంతో మంది అస్వస్థతకు గురువుతున్నారు. ఇంకా చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. పంటకు పట్టిన పీడను తొలగించాలంటే గడ్డిమందులు కొట్టక తప్పదు. ఇంకా.. చేపల చెరువుల్లో కూడా లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, చేపలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదని సంప్రదాయ వ్యవసాయంలో తెలుసుకోవడం కాస్త కష్టమే…ఇలాంటి పనులకు ఈ ఇద్దరు యువతులు టెక్నాలజీ సాయంతో యంత్రాలు కనిపెట్టారు. ఒక స్టార్టప్ గా స్టాట్ అయి..ఇప్పుడు వేల మంది రైతులకు తమ పరికాలను అందిస్తున్నారు. దాని ద్వారా రైతుల శ్రమ తగ్గడమే కాకుండా..ఆదాయం కూడా పెరుగుతుందట..ఒడిశా రైతు బిడ్డల స్టోరీపై మీరు ఓ లుక్కేయండి..!
ఒడిశాకు చెందిన మినుశ్రీ, అమృతలు స్నేహితులు. ఇద్దరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలే… దిల్లీలో కొంత కాలం ఐటీ ఉద్యోగాలు చేసిన ఈ అమ్మాయిలు 2015లో ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి సోలార్‌ ప్యానెళ్లు తయారు చేయడం ప్రారంభించారు.. ఆ క్రమంలోనే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి అందుకనుగుణంగా సౌర విద్యుత్తుతో నడిచే మూడు పరికరాలను ఆవిష్కరించారు. సౌర విద్యుత్తుతో నడిచే పిచికారీ యంత్రాన్ని తయారు చేశారు. ద్రావణాలనూ, యూరియా వంటి వాటిని చల్లడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
ఆరేడు గంటలు సోలార్‌ బ్యాటరీతో ఛార్జ్‌ చేస్తే నడిచే ఈ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు..
వీళ్లు తయారు చేసిన మరో యంత్రం..చేపల చెరువులో నీటి పరిమితినీ, శుభ్రతనీ, ఆక్సిజన్‌ శాతాన్నీ చెప్పేది. చేపలూ, రొయ్యలూ చనిపోకుండా అవి చక్కగా ఎదగడానికి ఉపయోగపడే ఈ యంత్రం నీటిపై తేలియాడుతూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా సౌర విద్యుత్తుతో నడుస్తుంది.
చేపలూ, రొయ్యలకు ఆహారాన్ని చల్లడానికి ఉపయోగించే యంత్రం కూడా వీరు తయారు చేశారు.. మనుషులతో పని లేకుండా ఒకేసారి 20 కేజీల ఆహారాన్ని నీటిలో చల్లగలదు. అలానే ఇది నీటిలో పీహెచ్‌ స్థాయుల్ని కూడా పర్యవేక్షిస్తుందట. ఇప్పటికే వేల మంది రైతులు ఈ పరికరాలను వాడి దాదాపు 30 శాతం అదనపు ఆదాయాన్ని పొందుతున్నారంటే.. అవి ఎంతలాభదాయకంగా ఉన్నాయో కదా.
ఎంతో మంది ఆడపిల్లలకు వీళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా మందికి ఏదో ఒక దందా చేయాలని ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా వనరులు, ఇంట్లో సపోర్ట్ లేక.. మన ఆలోచనలు మొదటి మెట్టుదగ్గరే ఆగిపోతున్నాయి. లైఫ్ అందరికీ ఒక లక్కీ ఛాన్స్ ఇస్తుంది. అప్పుడు అది వాడుకున్నప్పుడే సక్సస్ అవుతాం. మీ మీద మీకు ధైర్యం, నమ్మకం ఉంటే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా..ప్రయత్నం మాత్రం వదిలిపెట్టొద్దు మరీ..!
-Triveni Buskarowthu