బెండకాయల సాగులో మెలుకువలు, తెగుళ్లు నివారణ చర్యలు..

-

మన దేశంలో ఎక్కువగా పండించే కూరగాయలలో బెండకాయలు కూడా ఒకటి..వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు.అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగుతుంది. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉంటుంది. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉంటుంది. అండాశయము ఐదు అరలు కలిగి ఉంటాయి. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉంటుంది. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు భాగములుగ పగులు ఉంటుంది..ఈ పంటలో కనిపించే తెగుల్లు గురించి ఇప్పుడు చూద్దాం..

పల్లాకు తెగుళ్లు..

టెండ పైరుకు వచ్చు తెగుళ్ళలో ఇది చాలా ముఖ్యమైనది. వర్షాకాలపు పంటను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన ఆకులలోని ఈనెలు పసుపు పచ్చగా మారుతాయి. తెగులు తీవ్రమైనపుడు ఆకులన్నియు పసుపు రంగుకు మారును. ఈనెలు మందంగా తయారగును. ఈ తెగులు వలన చెట్లలో కాపు తగ్గిపోతుంది. ఒకవేళ కాయలు ఏర్పడినా అవి మామూలు కాయల కంటే గట్టిగాను చిన్నవిగాను ఉంటాయి. తెగులును కలుగజేసే వైరస్ మొక్కల రసం ద్వారా కాని విత్తనం ద్వారా కాని వ్యాపించదు. తెల్లదోమ మరియు దీపపు పురుగుల ద్వారా తెగులు వ్యాప్తి చెందును. వైరస్ అడవి జాతి మొక్కల మీద జీవించి ఉండును.

నివారణ:
*. తగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి.
*. వైరస్ జీవించే అడవి జాతి మొక్కలను, గడ్డి మొక్కలను తీసివేయాలి.
*. తెగులు వ్యాప్తికి దోహదం చేయు తెల్లదోమ మరియు దీపపు పురుగులను అరికట్టుటకు మిథైల్ పరాథియాస్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో లేక డిమిక్రాస్ మరియు నువాస్ ల మిశ్రమాన్ని (ప్రతిది 1 మి.లీ.) 3 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
*. తిమ్మెట్ మందు గుళికలను విత్తనం వేయుటకు ముందు మరియు విత్తనం వేసిన 40-50 రోజుల తరువాత పొడి ఇసుకలో కలిపి భూమిలో వేసినట్లయితే ఈ తెగులు అంతగా వృద్ధి చెందదు.
*.తగులును తట్టుకునే పూస సవాని, సెలక్షన్ -4, సెలక్షన్ – 10 వంటి రకాలు తీవ్రత వలన మచ్చలు నలుపు రంగుకు మారి ఆకులు రాలిపోవును.అంతేకాదు పువ్వులు కూడా రాలిపోతాయి..

బూడిద తెగులు:

ఈ తెగులు ఎక్కువగా నవంబర్ మరియు మార్చి మాసాల మధ్యలో బెండ పైరుకు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట మొక్కల క్రింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడును. క్రమేపి ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరించును. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగుకు మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులుసోకటం వలన పూత విపరీతంగా రాలిపోవును మరియు మొక్కలలో పుష్పించే శక్తి క్షీణిస్తుంది చల్లని పొడి వాతావరణం ఈ వ్యాధి వృద్ధి అనువైనది.

నివారణ:

ఈ తెగులు ఆశించిన వెంటనే, మరో 15 రోజుల వ్యవధిలో రెండవసారి లీటరు నీటికి కార్బండిజం 1గ్రా. లేదా థయోఫినేట్ మిథైల్ 1గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ 1 మి.లీ. లేదా కెరాథేన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి..

ఈ పంట లో ఎక్కువగా వచ్చే తెగుల్లలో రెండు రకాల తెగుళ్లు అధికం..అందుకే రైతులు ఆలస్యం చెయ్యకుండా వెంటనే వ్యవసాయ నిపుణులను కూడా సంప్రదించాలి..ఇది గుర్తుంచుకోవాలి…

Read more RELATED
Recommended to you

Latest news