రైతులకి అధిక సమాచారాన్ని ఇచ్చే మొబైల్ యాప్స్ గురించి మీకోసం..!

రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వ్యవసాయ అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకువచ్చాయి. అలానే వ్యవసాయంలో నూతన పద్దతులని కూడా అనుసరించడం జరుగుతోంది. వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులు తెలుసుకోవడానికి వీలుగా ఎన్నో మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి.

farmers
farmers

టెక్నాలజీ పెరగడం వల్ల ఇది మనకి బెనిఫిట్ గా ఉంటుంది. మారుమూల గ్రామీణ రైతులకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి తెలియజేయడం జరుగుతుంది. రైతులకు అందుబాటులో ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

కిసాన్ సువిధ మొబైల్ యాప్:

ఇది ఈ వాతావరణ సమాచారాన్ని, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహాలు, మొక్కల రక్షణ వంటి వాటి గురించి తెలుపుతుంది.

పీఎం కిసాన్ యాప్:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ని చాలా మంది రైతులు పొందుతున్నారు. ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ యాప్ ద్వారా పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

బననా ప్రొడక్షన్ టెక్నాలజీ మొబైల్ యాప్:

పండ్ల తోట లో అధునాతన వ్యవసాయ పద్ధతుల గురించి తెలపడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీనిని తీసుకు వచ్చింది.

ఈ- పంట యాప్:

విత్తనాలు, పురుగుల మందులు, వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం ఇటువంటివన్నీ ఈ యాప్ లో మనం తెలుసుకోవచ్చు.