చలికాలంలో దూడల పోషణ..ముఖ్యంగా తీసుకొవాల్సిన జాగ్రత్తలు..

-

చలి మనుషులకు మాత్రమే కాదు..పశువులకు కూడా ఉంటుంది..దాంతో అనారోగ్యానికి కూడా గురవుతాయి..అంతేకాదు ఎన్నో మార్పులు కూడా వస్తాయి..దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది, పాకల్లో వెచ్చదనాన్ని కల్పించుటకు, ఉష్ణోగ్రతను పెంచడం కొరకు రూమ్ హీటర్స్ను అమర్చుకోవాలి.

 

అంతేకాదు దూడలకు ఇచ్చే ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆవుదూడ శరీర బరువులో పదోవంతు పాలను, గేదె దూడలకు పదిహేనవ వంతు పాలను తాగించాలి. రెండు నెలల వయస్సు గల దూడలకు ప్రత్యేకంగా తయారు చేసిన కాప్ స్టార్టర్ను దాణాగా ఇవ్వాలి. దూడ లకు మొదటి మూడు నెలలు మాత్రమే పాలను తాగించాలి.. ఆ తర్వాత తగ్గిస్తూ రావాలి..రెండు వారాల తర్వాత నుంచి పశుగ్రాసాలు, మేపడం అలవాటు చేయాలి. దాణాను దూడలకు ఇచ్చేదాణాలో మాంసకృ త్తులు ఎక్కువగా ఉండే పీచు పదా ర్థాలు తక్కువగా ఉండాలి.

దాణాను దూడలకు మేపడంవల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి శరీర బరువు పెరుగుతుంది. దూడల దాణాలో రెండు శాతం ఖనిజ లవణ మిశ్రమాన్ని, ప్రతి 100 కిలోల దాణాలో 10 గ్రా. విటమిన్ ఎ, డి లను కలపాలి.దూడలకు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల అవి ఆరోగ్యంగా ఉండటం తో త్వరగా బరువును కూడా సకాలం లో పెరుగుతాయి.. చలికాలంలో న్యూమోనియా వ్యాధిసోకే  ప్రమాదం ఉంది.. దూడలు బొడ్డువాపు, విరేచనాలు, కడుపుబ్బడం మొదలగు వ్యాధులకు గురైతే వెంటనే చికిత్స చేయించాలి.. వాటి స్థితిని బట్టి ఆరోగ్యం వైద్యులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news