కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా ముందుగా వ్యవసాయం నిపునులను సంప్రందించి వెయ్యడం మంచిది.ఇప్పుడు మనం కుసుమ పంట సాగు, పంట దిగుబడిని పెంచడానికి తీసుకొవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే, కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. మన రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కుసుమ పంట విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం కోత సమయంలో ఈ పంటలో ముళ్ళ వల్ల కూలీలు రాకపోవడం ఇలాంటివి జరగడం కామన్..

ఈ పంట వేయడానికి కావలసిన నేలలు..

ఈ పంట వేసుకోవడం కోసం ముందుగా నేలను పరీక్షించాలి. తేమను నిల్పుకోనే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. మ్యాజేరియం ఎండుతెగులు ఎక్కువగా ఆశించే అవకాశం వున్నందున ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది.

ఈ పంటలు వేసుకోవడం కోసం పంటగా వేసుకునేటప్పుడు నాగలితోగాని, ట్రాక్టర్ గాని లోతుగా దున్నుకొని, ఆ తరువాత రెండు మూడు సార్లు గుంటకను తోలు కున్నట్లయితే కలుపును నివారించుకోవడమే కాకుండా, భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. కుసుమను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తరువాత వేసుకునేటప్పుడు పంట లో కలుపు మొక్కలను పూర్తిగా తీసి వేయాలి..

నీటి తడి:
బరువైన నేలలో కుసుమ పంట వేసినప్పుడు అంత ఎక్కువగా నీళ్ళు పెట్టవలసిన అవసరం లేదు..ఒకటి, రెండు నీటి తడులు అవసరం.నేలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులలో కీలక దశలయినటువంటి కాండం సాగే దశ (30-35 రోజులలో) లేక పూతదశ (65 నుండి 75 రోజులకు) లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60% పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కలుపు నివారణ:

కుసుమను విత్తిన తర్వాత 20 నుంచి 30 రోజు ఒకసారి కలుపు తీసుకోవాలి.భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి..ఇలా చేయడం వల్ల కలుపు నివారణ తో పాటు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది..ఈ మెలుకువలు పాటిస్తే పంట దిగుబడి బాగా పెరుగుతుంది..అధిక లాభాలను కూడా పొందవచ్చు..