కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలను బీసీల అభివృద్ధి కోసం వాడుకుంటున్నానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించారని.. కానీ ముందుగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని చెప్పారు.
బీసీలు బాగుండాలి.. బీసీలు ఎదగాలని పోరాటాలు చేసే తాను పదవుల కోసం పని చేస్తారు అనేది అపోహ మాత్రమే అని ఆర్. కృష్ణయ్య అన్నారు. తాను దివంగత నేత ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి పదవిని వదులుకున్నారు అని చెప్పారు. తాను ఎన్నడూ పదవుల కోసం పని చేయలేదన్నారు. తనకు రాజ్యసభ పదవి రావడం పట్ల బీసీల గౌరవం పెరుగుతోందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల బీసీల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానన్నారు ఆర్.కృష్ణయ్య.