ద్రాక్ష సాగులో రైతులు పాటించాల్సిన మెళుకువలు..!

-

ద్రాక్షకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తింటారు..కొన్ని వాతావరణ పరిస్ధితుల్లోనే ద్రాక్షను సాగుచేస్తుండగా, కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొమ్మలు కత్తిరింపు కీలకం ; కొమ్మల కత్తిరింపుతో ద్రాక్ష త్వరగా కాపుకువస్తుంది. తీగను సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా ద్రాక్ష పంట దిగుబడి రాదు. సంవత్సరానికి 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించటం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి. ద్రాక్ష గుత్తుల పరిమాణం , నాణ్యత పెంచటానికి జిబ్బరిల్లిక్ ఆసిడ్ అను హార్మోన్ ను పైరుపై పిచికారి చేయాలి. గుత్తులను పిందె పడిన వెంటనే 50-60 పీపీఎం జీఎ, ద్రావణంలో ఉంటం వల్ల 30-50% వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది..

ద్రాక్ష కోత విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉన్న గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించవలెను. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లుగా కనబడుతుంది. పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్ల లో మొత్తం కరిగే ఘనపదార్థాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిక. ద్రాక్ష దిగుబడి అన్నది నేల,వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది..మన రాష్ట్రాల లో అనబి-ఇ-షాహి 10-15 టన్నులు/ఎకరానికి దిగుబడి వస్తుండగా, థామ్సన్ సీడ్స్ 6-8 టన్నులు దిగుబడిని ఇస్తుంది. వ్యవసాయ సలహాదారుల సలహాలను పాటిస్తే ఇంకా మంచి దిగుబడి పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news