పట్టుపురుగుల పెంపకంలో ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి..

-

మన దేశంలో పట్టుకు మంచి డిమాండ్ ఉంది.. అందుకే ఈ పట్టు పురుగులను పెంచెందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.ఈ పురుగులకు రోగాలు ఎక్కువగా భాధిస్తుండటం సహజం..తరచుగా వచ్చే రోగాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సున్నం: సున్నపు రాళ్ళపై నీటిని చిలకరించినప్పుడు లేదా తేమ గాని, గాలి గాని సోకినప్పుడు, గాలిలోని నీటిని మరియు కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి, రాళ్ళు విడిపోయి విడి సున్నం ఏర్పడుతుంది.చల్లారిన తరువాత పొడిగా చేసి జల్లెడపట్టి సంచులలో లేక డబ్బాలలో నింపి, గాలి చొరబడకుండా భద్రపరుచుకోవాలి.పై విధముగా పొందిన సున్నపు పొడి పట్టుపురుగుల పెంపకంలో అత్యంత ప్రభావ కారిణిగా ఉపయోగపడుతుంది. పురుగులు జ్వరంలో కూర్చున్నప్పుడు దీనిని చల్లడం వల్ల ఆకులోని తేమను పీల్చుకొని ఆకులు తొందరగా ఎండిపోతాయి.ప్రతి దశలో చివరిమేత వేసిన 4-5 గంటల తర్వాత సున్నపు పొడిని చల్లాలి.అంతేకాదు..పడకలలోని విషవాయువులను కూడా ఇది గ్రహించడముతో పడకలలో ఆరోగ్యకరమైన, తేమ రహితమైన వాతావరణం ఏర్పడుతుంది.ఇది జ్వరం లో వున్న పురుగులకు అనువైన వాతావరణం, పడకలలో మిగిలిన సున్నం పట్టుపురుగుల శరీరంలో ప్రవేశించినప్పుటికి హానికరం కాదు.

బ్లీచింగ్:

బ్లీచింగ్ పౌడర్ లో 25-30 శాతం క్లోరిన్ ఉంటుంది..శుద్ది ప్రక్రియ 0.4 శాతం క్లోరిన్ అవసరం, కాబట్టి 2శాతం బ్లీచింగ్ పౌడర్ ను వాడుతారు.ఇది కాంటాక్ట్ శుద్దికారి కాబట్టి అన్ని పరికరాలపైనా పిచికారీ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ ఒక బలమైన ఆక్సిడైజింగ్ ఎజెంట్ గా పేర్కొన వచ్చు. ఇందులో హైపోక్లోరిక్ ఆమ్లం బలమైన బాక్టీరియా సంహారిణి కాగా, ఆక్సిజన్ బలమైన ఆమీకరణ కారకo. ఈ రసాయన చర్యలోని కాల్సియం అయాన్లు వైరస్ కణాలపై ప్రభావం చూపించగా, బ్లీచింగ్ పౌడరు యొక్క క్షార గుణం క్రిమిసంహారిణిగా పని చేస్తుంది..

ఈ ద్రావణం తయారి ఎలా చెయ్యాలంటే?

అయిదు లీటర్ల నీటిలో 300 గ్రాముల కాల్చి విడగొట్టిన సున్నమును మరియు 2 కేజీల బ్లీచింగ్ పొడిని వేసి బాగా కలియతిప్పాలి. పదినిమిషాల తర్వాత మరలా ఒక్కమారు కలియత్రిప్పి 35 లీటర్ల శుభ్రమైన నీటిలోకి వడబోయాలి.పట్టు పురుగులు వున్న రూమ్ మొత్తం పిచికారి చెయ్యాలి.క్లొరిన్ డ్తెయాక్స్డ్ ద్రావణం కూడా బాగా పని చేస్తుంది..వీటి వల్ల పట్టు పురుగుల లో రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news