వేసవి వేడి పుట్టేలా ఉన్నప్పుడు సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో మన చర్మానికి హాని కలిగించే అనేక కారకాలు ఉంటాయి. అందువల్ల అలాంటి సమయంలో మన చర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షించడానికి కావాల్సిన ముఖ్య పదార్థాల్లో కలబంద కూడా ఒకటి. చర్మ సంరక్షణకి కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో దీని గురించి ప్రత్యేకంగా చెబుతారు. ఈజిప్ట్ ప్రజలు కలబంద చెట్టుని అమరత్వం కలిగి ఉన్న చెట్టుగా అభివర్ణిస్తారు.
కలబంద చేసే ప్రయోజనాలు
వేసవిలో నీళ్ళు ఎక్కువగా తాగుతాం. మన శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుకునేందుకు నీళ్ళు తాగాల్సిందే. శరీరానికి నీళ్ళు ఎంత అవసరమో చర్మానికి తేమ అంత అవసరం. చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తూ ఉండాలి. దానికోసం కలబంద మాయిశ్చరైజర్లను వాడాలి. అధిక చెమట వల్ల చర్మ పొడిగా మారుతుంటే కలబంద మాయిశ్చరైజర్లను వాడితే తిరిగి తేమగా అవుతుంది.
తొందరగా ఫలితాన్నిస్తుంది
చర్మం చికాకుకి గురైనపుడు అక్కడ కలబంద రసాన్ని రాసుకుని రాత్రిపూట పడుకుంటే చాలు. తెల్లారేసరికి మళ్ళీ తిరిగి మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.
అన్ని చర్మ రకాలని పని చేస్తుంది.
కలబంద పని చేయని చర్మ రకమే లేదు. పొడిగా ఉన్న చర్మాన్ని తేమగా మార్చడానికి. చికాకు పెడుతున్న చర్మాన్ని మృదువుగా మార్ఛడానికి, మండుతున్న చర్మాన్ని తేలిక పర్చడానికి ఉపయోగపడుతుంది.
ఇంకా చర్మానికే కాదు జుట్టుకి కూడా కలబంద బాగా పనిచేస్తుంది. జుట్టుకి సంబంధించిన మాస్కులని తయారు చేసి పెట్టుకుంటే చుండ్రు తదితర ఇతర సమస్యలని దూరం అవుతాయి.