సున్నితమైన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి పసుపుతో చేసిన మాస్క్..

-

చలికాలం చలి చంపేస్తుంటే చర్మం సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం పొడిబారిపోవడం, పెదాలలో పగుళ్ళు ఏర్పడడం, మొదలగు సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ టైమ్ లో మార్కెట్లో దొరికే ప్రోడక్టులని వాడడం వల్ల సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇరిటేషన్, ఎలర్జీ కలిగే అవకాశం ఉంది. దురద, చికాకు వంటి ఇబ్బందులు రావడం చాలా సహజం. అందువల్ల మార్కెట్లో దొరికే రసాయన పదార్థాలను వాడడం కంటే ప్రకృతిలో దొరికే పదార్థాలతో చర్మ సమస్యలను దూరం చేసుకోవడం ఉత్తమం.

సున్నితమైన చర్మం కలిగినవారి చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ప్రకృతి వైద్యం పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

పసుపుతో చేసిన ఫేస్ మాస్క్, సున్నితమైన చర్మం కలవారికి చక్కగా పనిచేస్తుంది.

దానికి కావాల్సిన పదార్థాలు

అర టీ స్పూన్ పసుపు
ఒక టేబుల్ స్పూన్ కలబంద రసం
కొన్ని రోస్ వాటర్

తయారీ విధానం

ఈ మూడింటినీ ఒకే దగ్గర మిశ్రమం చేయాలి. బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా అప్లే చేసుకోవాలి. ఈ మాస్క్ ఎండిపోకుండా తడిగా ఉండేలా చూసుకోవాలి. మాస్క్ మరకలు తొందరగా పోవడానికి ఆ మిశ్రమంలో కొద్దిపాటి నూనె వేసుకుంటే బెటర్.

కలబంద రసం కారణంగా చర్మం ఎరుపుగా మారడం, చికాకు తెప్పించడం పూర్తిగా తగ్గుతుంది. రోస్ వాటర్, పసుపు వల్ల చర్మ ఇబ్బందులు తగ్గుతాయి. సున్నితమైన చర్మం వల్ల మీరూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటే, పసుపుతో చేసిన ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news