ప్రస్తుత ప్రపంచంలో జుట్టు తెల్లబడడం అనేది పెద్ద సమస్య. అది పెళ్ళి కాకముందు పడుతుందంటే మరీ పెద్దదై పోతుంది. ఎంత కలర్ వేసినా, అలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ తెల్లబడిన జుట్టుని నల్లగా ఎలా చేసుకోవాలా అని చూస్తున్నారు. ఒక్కసారి జుట్టు తెల్లబడిందంటే మల్ళీ నల్లబడే అవకాశమే లేదని చెబుతుంటారు. ఎందుకంటే అలాంటి ఉదాహరణలు చూసినవాళ్ళు తక్కువ కాబట్టి, కానీ అది నిజంగా నిజమా అంటే కాదనే చెప్పాలి. అవును, తెల్లబడిన జుట్టుని అత్యంత సహజంగా నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా వాటినెలా వాడాలో తెలుసుకుని ఫాలో అయిపోవడమే.
ఉసిరి
ఉసిరి సిట్రస్ ఫలం. సి విటమిన్ అధికంగా ఉంటుంది. దానివల్ల చర్మానికి, జుట్టుకి చాలా మేలు కలుగుతుంది. తెల్లబడ్ద జుట్టుని నల్లగా మార్చడానికి, ఉసిరి పొడిని తయారు చేసుకుని దాన్ని కొబ్బరి నూనెలో వేసి పొయ్యి మీద బాగా మరిగించాలి. ఉసిరి పోడి పూర్తిగా నూనెలో కలిసిపోయిన తర్వాత పొయ్యి మీద నుండి దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఆ నూనెని తలకి పట్టించాలి. 30నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు నల్లబడుతుంది.
నెయ్యి
నెయ్యి కూడా జుట్టుని నల్లబరుస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మంచి ఆరోగ్యం కోసం రెగ్యులర్ గా అందరూ వాడే నెయ్యి జుట్టు నల్లబడడానికి మేలు చేస్తుంది. కొద్దిగా నెయ్యి తీసుకుని మీ తలకి పట్టించండి. తర్వాత కొద్ది నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగండి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి. పెళ్ళి కాకుండానే జుట్టు తెల్లబడిందని ఇబ్బంది పడుతున్న మీకు, పై రెండు పద్దతులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.