హోలీ సందర్భంగా మీ జుట్టుని కాపాడుకునే చిట్కాలు తెలుసుకోండి..

-

ప్రకృతితో మమేకం అయ్యేందుకు, ప్రకృతిలోని అన్ని రంగుల్లో మనల్ని మనం కలిపేసుకునేందుకు హోళీ పండగ వచ్చేసింది. ఈ సంవత్సరం మార్చి 28వ తేదీన హోళీ పండగ జరుపుకుంటున్నారు. దానికోసం ఇప్పటికే రంగులన్నీ సిద్ధం చేసుకున్నారు. ఐతే కరోనా మహమ్మారి ఉన్న ఈ సమయంలో హోళీ పండగని చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా గుంపు ఉన్న చోట్లకి వెళ్ళకుండా మీ కాలనీ పరిసరాల్లోనే జరుపుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అదలా ఉంచితే రంగుల వల్ల జుట్టు పాడవుతుంది కాబట్టి, దాన్ని ఎలా కాపాడుకోవాలో కొన్ని చిట్కాలని తెలుసుకుందాం.

మొదటగా, రేపు హోళీ జరుగుతుందంటే ఒకరోజు ముందుగా మీ జుట్టుకి ఆయిల్ తో మర్దన చేయండి. ముఖ్యంగా నెత్తి భాగంలో మర్దన చేయడం మర్చిపోవద్దు. దానివల్ల జుట్టుకి అంటిన రంగులు వాటిని పాడవకుండా నిరోధించవచ్చు. రసాయన రంగుల నుండి కాపాడుకోవాలంటే ఆమాత్రం జాగ్రత్త తీసుకోవాలి.

మీ జుట్టుని క్యాప్ తో కవర్ చేసుకోండి. నెత్తి మీద రంగులు పడకుండా ఉంటే బెటర్. క్యాప్ పెట్టుకోవడం వీలు కాకపోతే కనీసం పోనీటైల్ లాగా జుట్టుని ముడివేయండి. దీనివల్ల కొద్దిగానైనా రంగుల వల్ల కలిగే ఇబ్బందిని దూరం పెట్టవచ్చు.

జుట్టుని కడగాలనుకున్నప్పుడు ముందుగా నీటితో శుభ్రం చేయండి. షాంపూ వాడవద్దు. ముందు బాగా శుభ్రం చేసాక, అప్పుడు షాంపూతో మరలా కడగండి.

రసాయనాల వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది కాబట్టి, హోళీ అయ్యాక రెండు మూడు రోజులు హెయిర్ మాస్క్ పెట్టుకోండి. దానివల్ల కోల్పోయిన మృదుత్వం మరలా తిరిగి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news