సాగర్ లో సమర శంఖం పూరించిన కాంగ్రెస్

-

నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు, ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. కాంగ్రెస్ భవిష్యత్ కి సాగర్ ఉప ఎన్నిక కీలకంగా మారడంతో సర్వశక్తులు ఒడ్డుతుంది హస్తం పార్టీ. దుబ్బాక నుంచి మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ దాకా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్టుగా పోరుసాగుతున్న వేళ ఎలాగైనా నాగార్జునసాగర్‌ బై ఎలక్షన్‌లోనైనా ట్రెండ్‌ మార్చాలనుకుంటోంది కాంగ్రెస్‌పార్టీ. జనగర్జన పేరుతో హాలియాలో భారీ‌బహిరంగ సభ నిర్వహించింది.

ఉప ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో మాట్లాడిన ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని చెప్పారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. అధికారపార్టీ డబ్బు సంచులతో ప్రలోభాలకు గురిచేస్తారని, అయినా నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్‌లో తనదైన స్టయిల్‌లో ప్రచారం చేస్తున్నారు జానారెడ్డి. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి చేరిన కేడర్ మళ్ళీ సొంత గూటికి‌ తీసుకొస్తున్నారు. నియోజకవర్గానికి సాగు, తాగునీటిదాకా తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని జానారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

సాగర్ నియోజిక వర్గములో టీఆర్ఎస్ మండలానికి ఒక ఎమ్మెల్యే ను ఇంచార్జ్ గా, రెండు మున్సిపాలిటీ లకు ఇద్దరు ఎమ్మెల్యే లని ఇంచార్జ్ లుగా నియమించింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులే కాకుండా. 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేయడానికి సిద్ధపడుతున్నారు. తమ సమస్య ను ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి, నిరసన తెలియజేయడం కోసం నామినేషన్లు వేయాలని డిసైడ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news