చలికాలంలో వచ్చే చుండ్రుని పోగొట్టుకోవాలంటే…

-

చలికాలం చర్మ సమస్యలే కాదు జుట్టు సమస్యలు చాలా కామన్. చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడడం మొదలగు సమస్యలు ఎలా వస్తాయో అలాగే జుట్టు గట్టి పడడం, జిడ్డులా మారడం, చుండ్రు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. ఐతే ఇలామ్టి ఇబ్బందుల నుండి దూరం కావాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

ప్రతిరోజూ నెత్తిమీద మసాజ్ చేసుకోవాలి.

కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ తో నెత్తిని మసాజ్ చేసుకోవాలి. నెత్తిని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచడానికి మసాజ్ చాలా అవసరం. చలికాలంలో జుట్టు పై తేమ పూర్తిగా మాయమవుతుంది. అలా మాయమవకుండా ఉండడానికి మసాజ్ థెరపీ బాగా పనిచేస్తుంది.

హెయిర్ మాస్క్

పెరుగు, నిమ్మరసం.. రెండింటినీ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్ లా పెట్టుకోవాలి. ఆ తర్వాత 30-60నిమిషాల పాటు అలాగే వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మృదువైన షాంపూల వాడకం

రసాయనాలతో తయారు చేసిన షాంపూలు వాడేకంటే ఆహార పదార్థాలతో తయారు చేసిన షాంపూలని వాడాలి. రసాయన షాంపూలని వాడడం వల్ల నెత్తిమీద ఉన్న తేమ ఎగిరిపోతుంది. అలా కాకుండా ఉంచడానికి మృదువైన షాంపూలు బాగా పనిచేస్తాయి.

బట్టర్ మిల్క్ ముడి పదార్థంగా ఉన్న షాంపూ వాడితే ఇంకా బెటర్. ఇవి జుట్టుకి ఉన్న బాక్టీరియా పోగొట్టి, తేమని అందిస్తాయి.

బ్లాక్ టీతో జుట్టుని శుభ్రపర్చడం వల్ల జుట్టు మృదువుగా అవడంతో పాటు స్ట్రెయిట్ గా తయారవుతుంది. దీనివల్ల నెత్తి పూర్తిగా శుభ్రం అవడంతో పాటు తేమగా ఉంటుంది.

పై పద్దతులన్నీ పాటిస్తే చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యల నుండి దూరం కావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news