తడి జుట్టుతో నిద్రపోవడం కరెక్టేనా? నిపుణులు ఏమంటున్నారు..?

-

రాత్రిపూట తలస్నానం చేసి హాయిగా నిద్రపోతే బాగుంటుందని, నిద్ర కూడా తొందరగా వస్తుందని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాలన్నీ విశ్రాంతి చెందుతాయని, అందుకే తొందరగా నిద్ర పట్టేస్తుందని చెబుతుంటారు. అందుకనే రాత్రిపూట తొందరగా నిద్రరాని వారందరూ స్నానం చేసి మరీ పడుకుంటారు. చాలా మందికి ఇదొక అలవాటుగా మారింది. అయితే తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో నిద్రపోవడం కరెక్టేనా అన్నది చాలా మంది ప్రశ్న.

తడిజుట్టుతో నిద్రపోతే లాభాలున్నాయనే వాళ్ళూ ఉన్నారు. కానీ వారెవరికీ తెలియని విధంగా తడిజుట్టుతో నిద్రపోవడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రంతా తడి జుట్టుతో నిద్రపోవడం వలన జుట్టులో బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువ సేపు నీళ్ళలో ఆడితే కాలివేళ్ళు, చేతివేళ్ళు ఏ విధంగా మార్పు చెందుతాయో అలాంటి మార్పే జుట్టుకి కలిగుతుంది. కుదుళ్ళు పలుచగా మారి జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందు. ఫంగస్ వంటివి పెరిగి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఎప్పుడో ఒకసారి అయితే పెద్దగా ఫర్వాలేదు కానీ, రోజూ తలస్నానం చేసి పడుకుంటే మాత్రం పెద్ద అపాయంలో పడ్డట్టే.

తడిజుట్టుతో పడుకోవడం అంటే నెత్తి కూడా తడిగానే ఉండడం. దానివల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. తల స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకుని పడుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే, జుట్టుని ఆరబెట్టుకున్నా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేయకుండా ఉండడం మంచిదని అర్థం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news