ఇలా చేస్తే చాలు ట్యాన్ మాయం అయిపోతుంది…!

-

ఎక్కువ మంది మహిళలు బాధపడే సమస్యలలో ఈ ట్యాన్ సమస్య ఒకటి. సాధారణంగా ఈ ట్యాన్ మన ముఖ సౌందర్యానికి ఒక పెద్ద సవాలుగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన ముఖం వల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అంతే కాకుండా బయటకు వెళ్లి నలుగురితో కలిసి మాట్లాడాలి అన్న కూడా సంకోచిస్తాము. అయితే ఈ ట్యాన్ ని ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారా…? మరి ఇంకెందుకు ఆలస్యం దీని కోసం పూర్తిగా చూసేయండి.

tan
tan

ఎండా కాలంలో సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల మన ముఖం పై ట్యాన్ ఏర్పడుతుంది. ఇంట్లో ఉండే లైట్ ల కారణంగా కూడా ఈ ట్యాన్ ఏర్పడుతుంది. అదే శీతాకాలం అయితే మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. శీతాకాలం లో డీహైడ్రేషన్ వల్ల చర్మం నిర్జీవంగా అయిపోయి ముఖం పై ట్యాన్ కి కారణమవుతుంది. ఈ ట్యాన్ ని తొలగించుకోవాలంటే ఈ సులువైన మార్గాలు పాటించాల్సిందే. కేవలం ఈ వంటింటి చిట్కాలతో అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం చేసుకోవచ్చు.

ముందుగా మూడు చెంచాలు ముల్తాన మట్టికి కొంచెం నిమ్మరసం, కొద్దిగా తేనె, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట నుంచి 40 నిమిషాల వరకు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఈ పద్ధతిని నెలకు మూడు నుంచి నాలుగు సార్లు రిపీట్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. లేదా మరో పద్దతి ఏమిటంటే..? ఒక కప్పు పెరుగుకు ఒక చెంచా అరటిపండు గుజ్జు కొద్దిగా కలిపి రాసుకున్నా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. సులువుగా ట్యాన్ ని తొలగించడానికి ఈ పధ్ధతి అనుసరించేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news