పొడి చర్మంతో బాధపడుతున్నారా? ఐతే “కివీ” చేసే ప్రయోజనాలు తెలుసుకోండి.

చర్మ సంరక్షణ ఆరోగ్యంలో ఒక భాగం. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరచుగా చర్మ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు, చర్మం పొడిబారడం వంటివి వస్తుంటాయి. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. వీటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ మీకిది తెలుసా? చర్మానికి వచ్చే సమస్యలను కివీ పండు పోగొడుతుందని. కివీ పండుతో చర్మానికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో దీన్ని ఆహారంలో తీసుకోవడం చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు చర్మంపై ముడతలు మొదలగు సమస్యలను దూరం చేసి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

బిగుతైన చర్మం కోసం

కివీ పండున్ని చర్మంపై ఎలా అయినా పూయవచ్చు. ఇందులోని పోషకాలు చర్మంలోకి ఇంకి చర్మానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తాయి. దానివల్ల చర్మంపై ముడతలు వంటివి పోతాయి.

మొటిమలను దూరం చేస్తుంది

చర్మం నుండి విడుదలయ్యే సీబమ్ ను నియంత్రించడంలో కివి సాయపడుతుంది. అందువల్ల చర్మంపై మొటిమలు ఏర్పడవు. యాంటీఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి ముడతలు, గీతలు తగ్గిపోతాయి.

కివి ఫేస్ మాస్క్

కివిపై ఉన్న పొట్టు తీసివేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఆ పేస్టుని ముఖం మీద మెడ మీద రాసుకోవాలి. కొద్దిసేపయ్యాక నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే చర్మం నిగనిగ మెరుస్తుంది.

కివి, బాదం ఫేస్ ప్యాక్

దీన్ని వర్తింపజేయడానికి ముందుగా బాదంపప్పులని ఒకరోజు ముందు నానబెట్టాలి. ఉదయం పూట వాటిని తీసుకుని కివీతో పాటు గ్రైండ్ చేసి పేస్టులాగా తయారు చేయాలి. ఆ తర్వాత ముఖానికి వర్తించండి. కొద్దిసేపయ్యాక నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది.