మీరు తీసుకుంటున్న చర్మ సంరక్షణ చర్యలు సరైనవేనా..?

-

ఆరోగ్యకరమైన చర్మం కోసం ఏవేవో సాధనాలు వాడుతుంటారు. అందంగా కనిపించాలని తమ చర్మానికి సూట్ అయినా కాకపోయినా మార్కెట్లో పేరున్న ప్రోడక్టుని వాడుతుంటారు. అసలు ఏ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుందో తెలియకుండా వాడడం వల్ల సరైన ఫలితం పొందరు. అందుకే మీ చర్మ సంరక్షణకి ఏదై సరైనదో కాదో తెలియాలి.

మీ చర్మాన్ని అర్థం చేసుకోండి.

చర్మ సంరక్షణ సాధనాలు వాడడానికి ముందు మీకు చర్మాన్ని అర్థం చేసుకోవాలి. మీది సున్నితమైన చర్మం అయితే దానికి కావాల్సిన సాధనాలను తీసుకోవాలి. లేదంటే అందుకు తగిన వస్తువులు వాడాలి. ఏది వాడాలన్నా మీ చర్మం గురించి పూర్తిగా అర్థం చేసుకోండి. మార్కెట్లో ఉన్న ప్రతీ సాధనం చర్మ సంరక్షణకి సరైనవే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

సన్ స్క్రీన్ లోషన్

సన్ స్క్రీన్ లోషన్న్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. చర్మ సంరక్షణ కోసం ఎన్ని సాధనాలు వాడుతున్నా, సన్ స్క్రీన్ లోషన్ ని మిస్ చేయరాదు. సూర్యుని నుండి వచ్చే కిరణాల్లో చర్మానికి హాని చేసేవి చాలానే ఉంటాయి. అందుకే సన్ స్క్రీన్ లోషన్ తప్పని సరిగా వాడాలి.

మీ చర్మం టైప్ తెలుసుకోండి.

మీది పొడి చర్మమా, ఆయిల్ చర్మమా అన్నది తెలుసుకోవాలి. దానికి తగినట్లుగానే చర్మ సంరక్షణ సాధనాలు వాడాలి. పొడి చర్మం ఉన్నవారికి మయిశ్చరైజేషన్ కంపల్సరీ. అలాగే ఆయిల్ చర్మానికి కావాల్సిన చర్మ సంరక్షణ సాధనాలు తప్పనిసరిగా వాడాలి.

ఇవేమీ తెలుసుకోకుండా చర్మ సాధనాలు వాడడం వల్ల అది మీకు సూట్ కాకపోతే లేని పోని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ చర్మం గురించి తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news