పశ్చిమగోదావరి జిల్లాలో గంటగంటకు వింత వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వింత వ్యాధితో కొమరేపల్లిలో 18 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. ఈ వింత వ్యాధితో ఉన్నట్టుండి బాధితులు కింద పడిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 50 మందికి పైగా వింత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు. భీమడోలు, దెందులూరు మండలంలో వింత వ్యాధి బాధితుల సంఖ్య 54 చేరింది.
కేవలం పూళ్ళలోనే బాధితుల సంఖ్య 36కి చేరింది. ఇక ఈ మండలాల్లో పొలంలో ఇద్దరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. వింత వ్యాధి వల్లే మృతి చెందారని బాధితుల కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే దాని ఆధారంగా కారణాలు గుర్తిస్తామని చెబుతున్నారు. ఇక మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కొమరేపల్లికి వెళ్లనున్నారు.