పొడిబారిన చర్మం నుండి కళ్ళ కింద వలయాలు పోగొట్టే వరకు బంగాళ దుంప రసం చేసే మేలు..

-

ప్రపంచంలో అత్యధిక జనాభా ఆహారంగా తీసుకునే ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది బంగాళదుంప అని చెప్పవచ్చు. అందుకే ప్రపంచంలోని అన్ని పంటల్లో కెల్ల బంగాళదుంపనే ఎక్కువగా పండిస్తున్నారు. బంగాళ దుంపను ఎలాగైనా ఉపయోగించవచ్చు. ఏ కూరగాయలతో అయినా కలిపి వండుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, కాల్షియం, ఐరన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ సౌందర్యానికి కూడా బంగాళ దుంప బాగా ఉపయోగపడుతుంది.

పొడిబారిన చర్మం నుండి ముడుతలు, వృద్ధాప్య ఛాయలు, కళ్ళ కింద వలయాలు పోగొట్టుకోవడానికి బంగాళ దుంప రసాన్ని రకరకాలుగా వాడవచ్చు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మెరిసే చర్మం కోసం

కావాల్సిన పదార్థాలు

1 బంగాళ దుంప
1టేబుల్ స్పూన్ శనగపిండి
1టేబుల్ స్పూన్ కలబంద రసం

తయారీ విధానం

ముందుగా బంగాళ దుంపలను బాగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకుని శనగపిండి, కలబంద రసం కలుపుకుని రుబ్బి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖం మీద మెడ భాగాల మీద అప్లై చేసుకోవాలి.

కళ్ళ కింద వలయాలు పోవడానికి కావాల్సిన పదార్థాలు

బంగాళ దుంప రసం
దోసకాయ రసం

బంగాళ దుంప రసాన్ని దోసకాయ రసంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో తీసుకుని కళ్ళ కింద ఉన్న వలయాల మీద రుద్దాలి. ఆ తర్వాత 20 నిమిషాలయ్యాక శుభ్రంగా కడుక్కోవాలి.

మొటిమలు పోగొట్టడానికి

కావాల్సిన పదార్థాలు

బంగాళ దుంప
1టేబుల్ స్పూన్ తేనె
1టేబుల్ స్పూన్ కలబంద రసం

బంగాళ దుంపను బాగా రుబ్బుకుని పేస్టులాగా తయారు చేసి దానికి తేనె, కలబంద రసాన్ని కలుపుకుని ముఖానికి వర్తించాలి. కొద్ది సేపయ్యాక నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news