హోళీ రంగులకి మీ చర్మం, జుట్టు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

-

జీవితాన్ని రంగుల్లా తీర్చిదిద్దడానికి హోళీ పండగ వచ్చేస్తుంది. రంగు రంగుల ప్రపంచానికి స్వాగతం చెబుతూ కొత్త రంగులని జీవితంలోకి ఆహ్వానించడానికి మరెంతో దూరంలో లేదు. రంగులు చల్లుకోవడం అందరికీ ఇష్టమే. ఈ నేపథ్యంలో రంగుల్లోని రసాయనాల వల్ల చర్మం, జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. అందువల్ల హోళీకి ముందు ఏం చేయాలో తెలుసుకుందాం.

బ్లీచింగ్, ఫేషియల్ వంటివి వారం రోజుల ముందు నుండే మానేయాలి.

పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా పెదవులపపై, చెవుల వెనకాల ఖచ్చితంగా రాసుకోవాలి.

జుట్టు, గడ్డానికి నూనె మర్దన చేయాలి.

బయటకి వెళ్లే అరగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా రాసుకోవాలి.

గోళ్ళని పాలిష్ చేసుకోవడం మర్చిపోవద్దు.

మాస్క్ ధరించండి. ప్రకృతి సిద్ధమైన రంగులకే ప్రాధాన్యత ఇవ్వండి.

బంగారు, వెండి రంగులకి దూరంగా ఉండండి.

మీ చర్మానికి అంటుకున్న రంగు చికాకు పెడుతుంటే వెంటనే శుభ్రపర్చుకోండి. మాయిశ్చరైజర్ ని చేతిలో ఉంచుకోండి. చికాగ్గా అనిపించినప్పుడల్లా ఐస్ వాడినా బాగుంటుంది.

మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. దానివల్ల రంగు ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉండదు. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవద్దు.

హోళీ తర్వాత ఏం చేయాలంటే

తడి, మురికి బట్టలను విడిగా ఉంచండి.

వెచ్చని నీటిలో స్నానం చేయండి. గోధుమ పిండి, పెరుగు, పసుపు కలిపిన ఫేస్ ప్యాక్ ను వాడండి. దీన్ని శరీరమంతా రాసుకున్నా బాగానే ఉంటుంది. డిటర్జెంట్లు వాడితే చర్మం పొడిబారుతుంది.

సముద్రపు ఉప్పు, గ్లిసరిన్ వంటివి రంగును తొలగిస్తాయి.

రంగు పోవట్లేదని అదే పనిగా రుద్దవద్దు. ముఖ్యంగా మొటిమలు ఉన్నవారు ఇలా చేయడం మానుకోవాలి.

జుట్టుని శుభ్రపర్చుకోవడానికి షాంపూ వాడడం తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Latest news