సన్ స్క్రీన్ తో కలిగే ప్రయోజనాలు ఎన్నో..!

-

సన్ స్క్రీన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్య కిరణాలు డైరెక్టుగా ముఖానికి తగలకుండా సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మంది మహిళలు బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ని అప్లై చేసుకుంటారు. దీనితో అందంగా ఉండొచ్చు. అలానే ఇబ్బందులు కూడా రావు. అయితే సన్ స్క్రీన్ వల్ల కేవలం అందం మాత్రమే కాదు మరి కొన్ని ప్రయోజనాలు కూడా పొందొచ్చు. వాటి కోసం ఇప్పుడు మనం చూద్దాం.

క్యాన్సర్ ప్రొటెక్షన్:

హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ ప్రకారం సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే ముఖం పై ముడతలు, స్పాట్స్ వంటివి రాకుండా కూడా రక్షిస్తుంది సన్ స్క్రీన్ లోషన్. కాబట్టి సరైన ఎస్పీఎఫ్ లెవెల్స్ తో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ని ముఖానికి రాసుకోవడం వల్ల స్కిన్ కేన్సర్ సమస్య నుండి దూరంగా ఉండొచ్చు.

యువి రేస్ ప్రొటెక్షన్:

ముఖానికి సూర్యకిరణాలు పడటం వల్ల చర్మం ఎఫెక్ట్ అవుతుంది. ఓజోన్ లేయర్ కారణంగా యువి రేస్ డైరెక్ట్ గా ముఖానికి తగలడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక సన్ స్క్రీన్ లోషన్ ను మీరు బయటికి వెళ్ళినప్పుడు రాసుకుంటే… అటువంటి హానికరమైన కిరణాల నుండి రక్షణ లభిస్తుంది. అదే విధంగా చర్మం కూడా బాగుంటుంది.

అందమైన చర్మం:

చర్మంపై దురదలు, తొక్కలు ఊడిపోవడం, వాపు రావడం లాంటి సమస్యలు సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల రావు. అదే విధంగా చర్మం నల్లగా మారిపోవడం, ముడుతలు వంటి సమస్యలు కూడా రావు. కాబట్టి తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ ను రెగ్యులర్ గా బయటికి వెళ్లినప్పుడు రాసుకోవడం మంచిది. దీంతో అందం మాత్రమే కాకుండా మరికొన్ని లాభాలని కూడా మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news