చలికాలంలో చర్మం సులభంగా పొడిబారిపోతుంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం, బలమైన గాలులు వీచడం వల్ల చర్మం పొడిబారిపోయి చికాకు తెప్పిస్తుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ కాకుండా చలికాలంలో ప్రత్యేకమైన స్కిన్ కేర్ ప్రొడక్టులు వాడాలి.
ప్రోడక్ట్ ల గురించి పక్కన పెడితే ప్రస్తుతం చలికాలంలో చర్మాన్ని సురక్షితంగా తేమగా ఉంచే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
బాదం:
బాదం గింజల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హానికలుగజేసే వాటితో పోరాడి చర్మాన్ని పొడిబారకుండా తేమగా ఉంచుతాయి. ప్రతిరోజూజు రెండు మూడు బాదం గింజలను మీ డైలీ డైట్ లో తినండి.
కొబ్బరినీళ్లు:
చర్మాన్ని తేమగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే సైటోకైన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం వయసును తగ్గించేందుకు సహాయపడటమే కాకుండా తేమగా ఉంచుతాయి. కొబ్బరినీళ్ళను డైరెక్ట్ గా తాగొచ్చు లేదంటే కొబ్బరి చట్నీ తినవచ్చు.
టమాట:
అతినీలలోహిత కిరణాల వారి నుండి చర్మాన్ని రక్షించే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ టమాటల్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల చర్మం తేమగా ఉంటుంది. రోజువారి ఆహారంలో టమాటలను కచ్చితంగా భాగం చేసుకోండి.
పెరుగు:
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు తినడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు, చర్మంలోని తేమను బయటకు వెళ్ళనివ్వకుండా చేయడంలో పెరుగులోని పోషకాలు ఉపయోగపడతాయి. మీరు తినే ఆహారంలో కచ్చితంగా పెరుగును యాడ్ చేసుకోండి.