స్కిన్‌కు విటమిన్‌ సీ సిరమ్‌..అమ్మాయిలు ఇది వాడితే మీ అందం నెక్ట్స్‌ లెవల్‌..!

-

ఆరోగ్యానికి విటమన్ సీ అనేది ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఇది ఆరోగ్యానికే కాదు..అందానికి కూడా ఇది మేలు చేస్తుంది. విటమిన్-సి సీరం మీ చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యవంతంగా చేయడానికి పనిచేస్తుంది. మీ చర్మం పొడిబారితే.. డల్‌గా ఉంటుంది. చర్మం రంగు మసకబారుతుంది. ముఖం.. మెరుపును కొనసాగించలేకపోయినా.. ఈ సమస్యలన్నింటికీ సులభమైన పరిష్కారం విటమిన్ సి సిరమ్. ఈ సిరమ్‌ను సరైన పద్ధతిలో వాడితే ఫలితాలు అమోఘంగా ఉంటాయి.

విటమిన్ సి సీరమ్‌ను ఎప్పులు అప్లై చేయాలంటే..

విటమిన్-సి సీరమ్‌ను రాత్రి నిద్రపోయే ముందు ఉపయోగించాలి. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. మొదటిది, రాత్రి సమయంలోనే సీరం చర్మంపై బాగా పనిచేస్తుంది. రెండవది, పగటిపూట, అంటే సూర్యకాంతి వల్ల చర్మం కాంతి తగ్గే అవకాశం ఉంటుంది. పగటిపూట విటమిన్-సి సీరమ్ అప్లై చేయడం వల్ల చర్మంలో మెలనిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది చర్మం నల్లబడటం సమస్యకు దారితీస్తుంది.

కానీ మీరు పగటిపూట ఈ సీరమ్‌ని ఉపయోగించాలనుకుంటే.. మీరు మొదట విటమిన్-సి సీరమ్‌ను అప్లై చేసి, ఆపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేసి, ఆపై సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ యంగ్‌ లుక్‌తో కనిపిస్తుంది.

చర్మ కాంతిని పెంచడానికి విటమిన్-సి సీరమ్‌ బాగా ఉపయోగపడుతుంది.. ఎందుకంటే దీని వాడకం వల్ల చర్మంలో కొల్లాజెన్ పరిమాణం పెరుగుతుంది. కొల్లాజెన్ అనేది చర్మం లోపల ఉత్పత్తి అయ్యే ప్రోటీన్, కొత్త కణాలను నిర్మించడానికి చర్మం ఈ ప్రోటీన్‌ను ఉపయోగిస్తుంది.
చర్మంలో కణాల పునరుత్పత్తి పెరిగి రిపేరింగ్ స్పీడ్ పెరిగినప్పుడు చర్మం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది. కొల్లాజెన్‌ అనే మెష్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే స్కిన్‌ అంత టైట్‌గా ఉంటుంది. ఈ మెష్‌ పటుత్వం కోల్పోతే స్కిన్‌పై ముడతలు వస్తాయి.. విటమిన్-సి సీరమ్‌ను అప్లై చేస్తే ఫేస్‌ పై ఎలాంటి మచ్చలు లేకుండా మెరుస్తూ అందగా ఉంటారని సౌందర్య నిపుణులు అంటున్నారు. ఇంట్రస్ట్‌ ఉంటే మీరు ఓ సారి ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news