ఈ ఆయుర్వేద పద్దతులతో అందమైన చర్మం పొందొచ్చు..!

అందంగా ఉండాలని ఎవరికుండదు. అందంగా ఉండడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారిపోవడం డల్ గా ఉండడం ఇలాంటి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే అటువంటి సమస్యల నుండి బయట పడాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

ఈ ఆయుర్వేద చిట్కాలని కనుక పాటిస్తే తప్పకుండా చర్మం అందంగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మరి ఆయుర్వేద నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం. చర్మం అందంగా ఉండాలంటే ఈ టిప్స్ బాగా ఉపయోగ పడతాయి.

దీని కోసం మొదట ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుని రెండు గంటలపాటు నానబెట్టండి ఆ తర్వాత దానిని పేస్టులాగా చేసి అందులో పాలు పసుపు వేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఈ విధంగా చేయడం వల్ల చర్మానికి మాయిశ్చరైజ్ అందుతుంది. అలాగే చర్మం కూడా బాగుంటుంది.
వేడినీళ్లతో స్నానం చేయడం తగ్గించండి. బాగా వేడిగా ఉన్న నీళ్ళు పోసుకోవడం వల్ల చర్మం పొడిబారి పోతుంది.
చర్మం బాగుండాలంటే స్నానానికి ముందు నూనె ఒంటికి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉంటుంది.
ఇలా ఈ విధంగా మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే తప్పకుండా చలికాలంలో కూడా చర్మం బాగుంటుంది అలాగే చర్మ సమస్యలు ఏమి కూడా ఉండవు.