యూపీ ఎలెక్షన్స్: బీజేపీకి ఊరట.. కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేల చేరిక

-

వచ్చే నెలలలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బీజేపీకి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకున్నది. కాంగ్రెస్, ఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు.

ఓబీసీ నేతలు, బీజేపీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్ సమాజ్‌వాది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఓబీసీ నేతల్లో కమలం పార్టీ పట్టుకోల్పోయిందని ప్రచారం మొదలైంది.

అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేన్ష్, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. వీరిద్దరు కూడా ఓబీసీ నేతలే. వీరితోపాటు ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ధరమ్‌పాల్ సింగ్ కూడా డిప్యూటీ సీఎంలు కేశవ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో ఓబీసీ నేతలు బీజేపీకి దూరమవుతున్నారనే ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news