ఈ వ్యాపారంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ.. ఇంట్రస్ట్‌ ఉంటే లుక్కేయండి..!

-

సొంతంగా వ్యాపారం చేయాలనుకునే ఆలోచన ఉంటే.. ఎన్నో ఐడియాలు ఉన్నాయి.. ఉద్యోగం కంటే ఏదైనా చిన్న వ్యాపారం మేలనే ఆలోచన ఈరోజుల్లో చాలా మందికి ఉంది. ఒకవేళ మీరు కూడా అదే ఆలోచనలో మీరు కూడా ఉంటే ఈ ఐడియా వైపు వ్యాపారం వైపు ఓ లుక్కేయండి.

తేనెటీగల పెంపకం.. ఈ వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాధించుకోవచ్చు. ఇంకా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తాయి. ఇది గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా ప్రారంభించే అవకాశం ఉంటుంది. తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక కేంద్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క లక్ష్యం తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను పెంచడం, శిక్షణ అవగాహన కల్పించడం. నేషనల్ బీ బోర్డ్ నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించే పథకాలను కూడా ప్రారంభించింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ప్రభుత్వం 80 నుండి 85 శాతం సబ్సిడీని అందిస్తుంది. మీరు 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు..

ఆదాయం ఇలా..

ఒక పెట్టెలో 40 కిలోల తేనె లభిస్తే మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వరకు ఉంటుంది. అంటే మొత్తం ఖర్చు రూ.35,000 కాగా నికర లాభం రూ.1,05,000 గా ఉంటుంది. అయితే పేపర్‌ మీద లక్కలేసుకున్న అంత ఈజీగా ఉండదు వ్యాపారం అంటే.. ఒడిదొడుకులు ఎన్నో ఉంటాయి.. అంచనాలు తారుమారు అవ్వొచ్చు..మీకు ఇంట్రస్ట్‌ ఉంటే ఇంకాస్త డెప్త్‌గా ఈ వ్యాపారం గురించి తెలుసుకుని స్టెప్‌ తీసుకోవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news