బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు..పైగా సర్కారు సాయం కూడా..

-

చిన్న బిజినెస్ తో అధిక లాభాలను పొందాలని అనుకోనేవారికి ఎన్నో బిజినెస్ ఐడియాలు ఉన్నాయి.అందులో ఒకటి బిర్యాని ఆకుల సాగు కూడా ఒకటి.. ఈ మొక్కల పెంపకం కు ప్రభుత్వం సహకారం కూడా ఉంటుంది..చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో లాభాలాను అందుకోవచ్చు..ఇక ఆలస్యం ఎందుకు ఆ బిజినెస్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

money
money

 

బే ఆకు సాగు కూడా చాలా లాభదాయకమైన వ్యాపారం. కమర్షియల్‌ పద్ధతిలో బే ఆకు సాగు చేస్తే, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో భారీ లాభాలు పొందవచ్చు. ఈ సాగు ప్రత్యేకత ఏమిటంటే.. ఎక్కువ మానవశక్తి అవసరం లేదు. బే ఆకులను ఒకసారి నాటితే, అవి చాలా సంవత్సరాలు దిగుబడిని ఇవ్వడం విశేషం. బే ఆకుల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తుంది.

ఈ ఆకులను ఎలా సాగు చేయాలి?

బే ఆకు సాగును సులభంగా ప్రారంభించవచ్చు. 4 నుంచి 6 మీటర్ల దూరంలో నాణ్యమైన బే ఆకు మొక్కలను నాటాలి. లైన్ నుండి లైన్ మధ్య కూడా తగినంత దూరం ఉంచాలి. క్రమం తప్పకుండా నీటిని అందించాల్సి ఉంటుంది. బే ఆకు మొక్కలు చిన్నగా ఉన్నంత వరకు, మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలను నాటడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందవచ్చు..రైతులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు 30 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

లాభాలు..

ఒక బే ఆకు చెట్టు నుంచి ప్రతి ఏడాది 5 వేల వరకూ పొందవచ్చు..25 బే మొక్కలను నాటితే, మీరు ఏటా 75 వేల నుండి 1 లక్ష 25 వేల వరకు సంపాదించవచ్చు. ఎక్కువ మొక్కలు నాటితే ఆదాయం పెరుగుతుంది. మీ ఆదాయం మీ మార్కెటింగ్ వ్యూహంపై కూడా ఆధారపడి ఉంటుంది..ఎలా లేదనుకున్న ఖర్చులు పోగా లక్ష వరకూ ఆదాయాన్ని పొందవచ్చు.. ఈ బిజినెస్ చేసే ఆలోచన ఉంటే మీరు కూడా ప్రారంభించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news